నిషిన్: ఆసియా గేమ్స్‌లో ఇండియా క్రికెట్ విమెన్స్ జట్టు స్వర్ణ పతకమే లక్ష్యంగా ఫైనల్ పోరుకు సిద్ధమైంది. మంగళవారం జరిగే టైటిల్ ఫైట్‌లో శ్రీలంకతో తలపడనుంది. ఆసియా కప్‌లో లంకను ఓడించిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా ఇక్కడ కూడా అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఇండియా.. జపాన్, బంగ్లాదేశ్‌పై భారీ విజయాలు సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది.
ఓపెనర్ షెఫాలీ వర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, రిచా ఘోష్ బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయం. స్పిన్నర్లు దీప్తి శర్మ, శ్రీచరణి, శ్రేయంక పాటిల్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. మరోవైపు సెమీస్‌లో పాక్‌ను ఓడించిన లంకేయులు కూడా ఫామ్‌లోనే ఉన్నారు. కెప్టెన్ చమరి ఆటపట్టు నుంచి ప్రమాదం పొంచి ఉంది. మిగతా ప్లేయర్లు కూడా సత్తాచాటితే ఇండియాకు పోటీ తప్పదు. ఓవరాల్‌గా ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
