జోరుమీదున్న కుర్రోళ్లు: శ్రేయాస్, పంత్ హాఫ్ సెంచరీలు

జోరుమీదున్న కుర్రోళ్లు: శ్రేయాస్, పంత్ హాఫ్ సెంచరీలు

చెన్నై: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం చెన్నై వేదికగా విండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ నిలకడగా ఆడుతుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న భారత్ కు మంచి ప్రారంభం దక్కలేదు. 25 స్కోర్ దగ్గర రాహుల్(6), కోహ్లీ(4) ఔట్ అయ్యారు. ఆ తర్వాత జోరుమీదున్న రోహిత్ (36)కూడా ఔట్ కావడంతో కష్టాల్లో పడింది టీమిండియా.

ఈ తర్వాత యంగ్ ప్లేయర్లు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ నిలకడగా ఆడుతూ స్కోర్ ను పెంచారు. ఈ క్రమంలోనే శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలు చేశారు. శ్రేయాస్ కిది వన్డేల్లో ఐదో హాఫ్ సెంచరీ. భారత్ 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 స్కోర్ చేసింది. శ్రేయాస్(53), పంత్(51) రన్స్ తో క్రీజులో ఉన్నారు.

విండీస్ బౌలర్లలో కాట్రెల్ 2, జోసెఫ్ 1 వికెట్లు తీశారు.