
చెన్నై: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం చెన్నై వేదికగా విండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 రన్స్ చేసింది. టీమిండియాకు మంచి ప్రారంభం దక్కలేదు. 25 స్కోర్ దగ్గర రాహుల్(6), కోహ్లీ(4) ఔట్ అయ్యారు. ఆ తర్వాత జోరుమీదున్న రోహిత్(36) కూడా ఔట్ కావడంతో కష్టాల్లో పడింది భారత్.
ఆ తర్వాత యంగ్ ప్లేయర్లు రిషబ్ పంత్(71), శ్రేయాస్ అయ్యర్ (70) నిలకడగా ఆడుతూ స్కోర్ ను పెంచారు. ఈ క్రమంలోనే వీరిద్దరు హాఫ్ సెంచరీలు చేసి భారత్ స్కోర్ ను పెంచారు. 100 భాగస్వామ్యం తర్వాత రిషమ్, శ్రేయాస్ ఔట్ కావడంతో 300 స్కోర్ చేయలేక పోయింది భారత్. చివర్ల జాదవ్(40) కూడా రాణించడంతో ఆ మాత్రం స్కోర్ చేసింది టీమిండియా.
విండీస్ బౌలర్లలో కాట్రెల్(2), జోసెఫ్(2) కీమోపాల్(2), పోలార్డ్ (1) వికెట్లు తీశారు.
India finish on 288/8, thanks to 70 from Iyer and 71 from Pant.
Sheldon Cottrell finished with figures of 2/46 including three maidens, and the wicket of Virat Kohli ? #INDvWI | FOLLOW ? https://t.co/9QkJ4D8HOy pic.twitter.com/hNtEQEWxKI
— ICC (@ICC) December 15, 2019