ఆదుకున్న కోహ్లీ, ధోనీ, పాండ్యా… విండీస్ టార్గెట్ 269

ఆదుకున్న కోహ్లీ, ధోనీ, పాండ్యా… విండీస్ టార్గెట్ 269

మాంచెస్టర్ : వరల్డ్ కప్-2019లో భాగంగా గురువారం వెస్ట్ ఇండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన..నిర్ణీత 50 ఓవర్లలో 7  వికెట్ల నష్టానికి 268 రన్స్ చేసింది. భారత్ కు మంచి ప్రారంభం దక్కలేదు. 29 స్కోర్ దగ్గర హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (18) తక్కువ రన్స్ కే ఔట్ కావడంతో తర్వాత వచ్చిన ప్లేయర్లు స్లోగా ఆడారు. విండీస్ కట్టుదిట్టమైన బౌలింగ్ కు భారత ప్లేయర్లు ఎక్కువ స్కోర్ చేయలేక పోయారు. కెప్టెన్ విరాట్ (72- హాఫ్ సెంచరీ) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ధోనీ(56) హాఫ్ సెంచరీ, పాండ్యా  46 రన్స్ తో చెలరేగడంతో భారత్ కు గౌరవప్రధమైన స్కోర్ దక్కింది.

టీమిండియా ప్లేయర్లలో..రోహిత్(18), రాహుల్(48), విరాట్(72), జాదవ్(7), విజయ్ శంకర్(14), పాండ్యా(46), ధోనీ(56) రన్స్ చేశారు.

విండీస్ బౌలర్లలో.. రోచ్(3), హోల్డర్(2), కాట్రెల్(2) వికెట్లు తీశారు.