V6 News

పుజారా ఫ్లాప్ షో

పుజారా ఫ్లాప్ షో

వెస్టిండీస్​ గడ్డపై టీమిండియా టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చటేశ్వర పుజారా ఫ్లాప్‌ షో కొనసాగుతోంది. మొదటి టెస్ట్‌ రెండు ఇన్నింగ్స్‌ ల్లో(2, 25) కలిపి 27 పరుగులే చేసిన పుజారా.. రెండో టెస్ట్​లోనూ నిరాశ పరిచాడు.ఆరు పరుగులే చేసి పెవిలియన్‌ చేరాడు. మరో ఓపెనర్​ లోకేశ్​ రాహుల్ (13) కూడా ఫెయిలయినా.. కొహ్లీ 76, మయాంక్​ అగర్వాల్ (55) హాఫ్​ సెంచరీతో సత్తాచాటారు దాంతో, శుక్రవారం మొదలైన రెండో టెస్ట్‌ లో టాస్​ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన ఇండియా మొదటి రోజు ఆట ముగిసే సమయ 90 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. హనుమ విహరీ 42,రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మెరిసిన కొహ్లీ, మయాంక్​

గత మ్యాచ్​ రెండు ఇన్నింగ్స్​ల మా దిరిగా ఈసారి కూడా ఇండియా టాపార్డర్​ తడబడింది. వెస్టిండీస్‌ కెప్టెన్‌ హోల్డర్‌ ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ లోనే లోకేశ్‌ రాహుల్‌‌ను పెవిలియన్‌ చేర్చాడు. టెస్ట్‌ స్పెషలిస్ట్‌ పుజారాను తన మూడో ఓవర్‌ లో జంబో స్పి న్నర్‌ కార్న్‌‌వాల్‌‌ ఔట్​ చేసి ఇండియాకు షాకిచ్చాడు. కార్న్‌‌వాల్ వేసిన బాల్‌‌ను కట్‌ చేయబోయిన పుజారా పాయింట్‌ లో బ్రూక్స్‌ కు చిక్కాడు. 46 రన్స్​కే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును మయాంక్ 55 ​, కోహ్లీ 76  రన్స్ తో ఆదుకున్నారు.  వెస్టిండిస్ బౌలర్లలో హోల్డర్ కు మూడు వికెట్లు, రాంకీమ్ కార్న్ వాల్ ,రోచ్ లకు చెరో వికెట్ పడ్డాయి