సెప్టెంబర్ 17 నుంచి ఢిల్లీలో  ఇండియా వాటర్ వీక్

సెప్టెంబర్ 17 నుంచి ఢిల్లీలో  ఇండియా వాటర్ వీక్

హైదరాబాద్, వెలుగు: మానవ మనుగడకు నీళ్లు ఎంతో ముఖ్యమని గోదావరి రివర్ మేనేజ్​మెంట్ బోర్డు చైర్మన్ ముఖేశ్ కుమార్ సిన్హా అన్నారు. భవిష్యత్ తరాల నీటి అవసరాలకు ఇప్పటి నుంచే వాటర్ మేనేజ్​మెంట్ అవసరమని తెలిపారు.

‘‘ఇండియా వాటర్ వీక్ 2024’’ 8వ నేషనల్ సెమినార్ సెప్టెంబర్ 17 నుంచి 20 వరకు ఢిల్లీలో జరగనున్నాయి. ఈ సెమినార్​కు కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ శుక్రవారం సికింద్రాబాద్​లోని సీజీవో టవర్స్​లో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖేశ్ కుమార్ మాట్లాడారు. ‘‘కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సెమినార్ నిర్వహిస్తున్నరు. వివిధ దేశాల నుంచి దాదాపు 5 వేల మంది ప్రతినిధులు అటెండ్ అవుతరు’’ అని తెలిపారు.