IND vs ENG 2025: అడ్డుకున్న రూట్, పోప్.. వికెట్ కోసం శ్రమిస్తున్న టీమిండియా

IND vs ENG 2025: అడ్డుకున్న రూట్, పోప్.. వికెట్ కోసం శ్రమిస్తున్న టీమిండియా

లార్డ్స్ టెస్టు తొలి రోజు రెండో సెషన్ లో ఇంగ్లాండ్ పై చేయి సాధించింది. లంచ్ తర్వాత పూర్తిగా టీమిండియాపై ఆధిపత్యం చూపించింది. రూట్, పోప్ నిలకడగా ఆడడంతో ఈ సెషన్ లో వికెట్ లేకుండానే భారత్ ముగించింది. తొలి రోజు టీ విరామ సమయానికి 2 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. క్రీజ్ లో రూట్ (54), పోప్ (44) ఉన్నారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీసుకున్నాడు. 

ALSO READ | IND vs ENG 2025: పంత్ స్థానంలో జురెల్.. గ్రౌండ్ వదిలి వెళ్లిన టీమిండియా వికెట్ కీపర్

2 వికెట్ల నష్టానికి 83 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఈ సెషన్ లో మొత్తం ఓవరాల్ గా 70 పరుగులు చేసి వికెట్లేమీ కోల్పోలేదు. సెషన్ ఆరంభంలో రూట్, పోప్ చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. బుమ్రా, ఆకాష్ దీప్ బౌలింగ్ ను సమర్ధవంతంగా అడ్డుకుంటూ పూర్తిగా డిఫెన్స్ కే పరిమితమయ్యారు. ఈ దశలో పరుగుల వేగం బాగా మందగించింది. కరంగా వీరిద్దరూ బ్యాట్ ఝులిపించడంతో స్కోర్ బోర్డు ముందుకు కదిలింది. ఈ క్రమంలో రూట్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీమిండియా ఎన్ని ప్రయత్నాలు చేసినా టీమిండియాకు ఈ సెషన్ లో వికెట్ దక్కలేదు. 

పోప్, రూట్ కలిసి మూడో వికెట్ కు అజేయంగా 209 బంతుల్లో 110 పరుగులు జోడించారు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీయకపోతే ఇంగ్లాండ్ తొలి రోజు భారీ స్కోర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకముందు తొలి సెషన్ లో ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకోవడంతో తొలి సెషన్ లో ఇంగ్లాండ్ 2 వికెట్లు నష్టానికి 83 పరుగులు చేసింది. ఓపెనర్లు డకెట్ (23), క్రాలీ (18) విఫలమయ్యారు.