ఆసియా షూటింగ్ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియాకు సిల్వర్‌‌‌‌

ఆసియా షూటింగ్ చాంపియన్‌‌షిప్‌‌లో  ఇండియాకు సిల్వర్‌‌‌‌

షింకెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా మెన్స్10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్‌‌  సిల్వర్ మెడల్ గెలుచుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో అన్మోల్ జైన్ (580), ఆదిత్య మల్కా (579), ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ సౌరభ్ చౌదరి (576)తో కూడిన ఇండియా జట్టు మొత్తం 1,735 పాయింట్లు సాధించి రెండో స్థానంతోరజతం  కైవసం చేసుకుంది. 

చైనా 1,744 పాయింట్లతో స్వర్ణం సాధించగా, ఇరాన్ 1,733 పాయింట్లతో కాంస్యం గెలిచింది. వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్  ఫైనల్ రౌండ్‌‌లో అన్వోల్‌‌ 155.1 పాయింట్లతో ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. జూనియర్ మెన్స్‌‌10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌‌లో కపిల్ 243.0 పాయింట్లతో స్వర్ణం సాధించాడు. మరో యువ షూటర్ గవిన్ ఆంటోనీ కాంస్యం నెగ్గాడు. టీమ్ ఈవెంట్ ఫైనల్లో గవిన్ (582), కపిల్, విజయ్ తోమర్ (562)తో కూడిన జట్టు మొత్తం 1,723 పాయింట్లతో రజతం సాధించింది.