న్యూఢిల్లీ: ఇండియా టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు.. ఐటీటీఎఫ్ వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్, బ్రాంజ్ మెడల్‌తో మెరిశారు. అండర్–19 బాయ్స్ ఫైనల్లో ఇండియా 0–3తో జపాన్ చేతిలో ఓడి రెండో ప్లేస్‌తో సరిపెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో అంకూర్ భట్టాచార్జీ 17–15, 6–11, 12–10, 4–11, 11–13తో ర్యూసేయ్ కవాకమిని చేతిలో ఓడిపోయాడు.
తర్వాతి మ్యాచ్‌ల్లో కజాకి యోషియామా 11–7, 11–8, 11–6తో అభినందన్ పై, టమిటో వటనాబే 11–9, 11–7, 11–3తో ప్రియాన్జు భట్టాచార్యపై గెలిచి స్వర్ణం సొంతం చేసుకున్నారు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో ఇండియా 3–2తో చైనీస్‌తైపీపై గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. అండర్–15 బాలికల కేటగిరీలో ఇండియా సెమీస్ చేరి బ్రాంజ్‌ను సాధించింది. సెమీస్‌లో 0–3తో సౌత్ కొరియా చేతిలో ఓడిన ఇండియా క్వార్టర్స్‌లో 3–1తో జర్మనీపై నెగ్గింది. అండర్–19 బాలికల క్వార్టర్స్‌లో ఇండియా 2–3తో చైనీస్‌తైపీ చేతిలో ఓడింది.
