
- ఇంగ్లండ్‌ను లైట్ తీస్కోం
- ఆసీస్‌పై విక్టరీని ఎంజాయ్ చేశాం
- ఇప్పుడు సిరీస్‌పైనే మా ఫోకస్
- ఇండియా వైస్ కెప్టెన్ రహానె
- రేపటి నుంచే ఫస్ట్ టెస్ట్
సొంతగడ్డపై టీమిండియా ఎప్పుడూ పులే. బ్యాట్స్‌మెన్ టన్నుల కొద్దీ పరుగులు చేయడం…. స్పిన్నర్లు ప్రత్యర్థి ప్లేయర్లను ఓ ఆట ఆడుకోవడం.. టీమ్ ఈజీగా విక్టరీలు సాధించడం మామూలే..! పైగా ఈ మధ్య ఫారిన్‌లోనూ మనోళ్లు అదరగొడుతున్నారు..! ఆస్ట్రేలియాలో హిస్టారికల్ విక్టరీ సాధించి హోమ్‌గ్రౌండ్‌లో ఇంగ్లండ్ సవాల్‌కు రెడీ అయ్యారు..! ఇంగ్లిష్ టీమ్‌తో నాలుగు టెస్టుల సిరీస్ రేపే మొదలవనుంది..! ఆసీస్‌లో అంత గొప్ప విజయం తర్వాత ఈ సిరీస్‌లో టీమిండియా విజయం నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయాలున్నాయి..! కానీ, సొంతగడ్డపై తాము ఎంత బలంగా ఉన్నప్పటికీ ఇంగ్లండ్‌ను లైట్ తీసుకోబోమని టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానె అంటున్నాడు. అలాగే, ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడిస్తే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు లభిస్తున్నప్పటికీ.. తాము అంతదూరం ఆలోచించడం లేదన్నాడు..! ఒక్కో మ్యాచ్ లెక్కన ముందుకెళ్తామన్నాడు..!
చెన్నై: ఆస్ట్రేలియాను వారి గడ్డపై చిత్తు చేసి బోర్డర్–గావస్కర్ ట్రోఫీని డిఫెండ్ చేసుకున్న టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం ప్రస్తుతం కసరత్తులు చేస్తోంది. ఆసీస్‌పై సాధించిన విక్టరీతో జట్టు కాన్ఫిడెన్స్ పెరిగినప్పటికీ ఇంగ్లండ్‌ను ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోమని ఇండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానె అన్నాడు. చెపాక్ స్టేడియంలో బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ అనంతరం రహానె.. మీడియాతో వర్చువల్‌గా మాట్లాడాడు. ఇంగ్లండ్ సిరీస్ ప్రిపరేషన్స్ గురించి వివరించాడు. టీమ్ కాంబినేషన్‌పై గురువారం నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. ‘ఆస్ట్రేలియా సిరీస్ మాకు చాలా స్పెషల్. ఆ విక్టరీని చాలా ఎంజాయ్ చేశాం. అదంతా ఇక గతం. ప్రజెంట్ మూమెంట్‌లో ఉండటంపైనే అన్ని ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్ కోసం.. కచ్చితంగా చెప్పాలంటే నెక్స్ట్ మ్యాచ్ కోసమే ఆలోచిస్తున్నాం. ఇండియాలో వికెట్స్ ఎలా ఉంటాయో మాకు తెలుసు. మా టీమ్ బలమేంటో మాకు తెలుసు. అదే టైమ్‌లో ఇంగ్లండ్ టీమ్‌ను మేము లైట్ తీసుకోవడం లేదు. స్థాయికి తగ్గట్టు ఆడటంపై దృష్టి పెట్టాం. ఏ విషయాన్ని ఈజీగా తీసుకోము’ అని రహానె చెప్పాడు.
బేసిక్స్‌పైనే దృష్టి..
2014 ఇంగ్లండ్ టూర్‌లో రహానె టాప్ క్లాస్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పుడు దాదాపు అదే బౌలింగ్ అటాక్‌ను మరోసారి ఫేస్ చేయనున్నాడు. అయితే, ఈ సిరీస్ కోసం తాను ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వడం లేదని, బేసిక్స్‌పైనే దృష్టి పెట్టానని అజింక్యా వెల్లడించాడు. ‘ఇంగ్లండ్ బౌలర్లను ఫేస్ చేసేందుకు స్పెషల్‌గా ఎలాంటి ప్రిపరేషన్ చేయడం లేదు. మేము రెండేళ్ల తర్వాత సొంతగడ్డపై ఆడబోతున్నాం. ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది. అందువల్ల నా ఆటను మెరుగుపర్చుకోవడంపైనే ఫోకస్ పెట్టా. టీమ్‌కు ఏం కావాలో దానికి అనుగుణంగా ఆడతా. పెద్దగా ఆలోచించను. కేవలం బేసిక్స్‌పైనే ఫోకస్ చేస్తా’ అని వైస్ కెప్టెన్ తెలిపాడు.
విరాట్ వచ్చాడు.. నేను బ్యాక్ సీట్‌లోకి..
స్టాండిన్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియాలో తాను సక్సెస్ అయినప్పటికీ విరాట్ కోహ్లీనే తమ కెప్టెన్ అని రహానె స్పష్టం చేశాడు. ‘విరాట్‌కు అండగా ఉండి కావాల్సిన సపోర్ట్ అందించడమే నా పని. పర్సనల్ రీజన్స్‌తో అతను ఆస్ట్రేలియా నుంచి ఇంటికి తిరిగొచ్చాడు. దాంతో వైస్ కెప్టెన్ అయిన నేను బాధ్యత తీసుకున్నా. ఇప్పుడు మళ్లీ జట్టుతో కలిశాడు. కాబట్టి నేను బ్యాక్ సీట్‌లోకి వెళ్లి అతనికి హెల్ప్ చేస్తా. నిజానికి, ఒక కెప్టెన్‌గా విరాట్‌కు చాలా బాధ్యతలుంటాయి. అతనితో పోలిస్తే నా పని చాలా ఈజీ. విరాట్ ఏదైనా అడిగితే సలహా ఇస్తా అంతే’ అని రహానె అన్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చాలా టైముంది…
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ గురించి తాము ఆలోచించడం లేదని అజింక్యా చెప్పాడు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇంకా మూడు నెలల దాకా టైముంది. అందువల్ల దాని గురించి ఆలోచన లేదు. మా ఫోకస్ అంతా ప్రస్తుత సిరీస్‌పైనే ఉంది. ఇంగ్లండ్ సిరీస్ రిజల్ట్ ప్రకారం డబ్ల్యూటీసీపై దృష్టి పెడతాం. ఆస్ట్రేలియా సిరీస్ ద్వారా ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండటం నేర్చుకున్నాం. అదే కంటిన్యూ చేస్తాం. ఆల్రెడీ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన న్యూజిలాండ్ మంచి క్రికెట్ ఆడింది. ఫైనల్ ఆడేందుకు వాళ్లు అర్హులు’ అని అజింక్యా తెలిపాడు.
హార్దిక్ కష్టపడుతున్నాడు..
ఫస్ట్ టెస్ట్ ఫైనల్ ఎలెవన్‌పై గురువారం తుది నిర్ణయం తీసుకుంటామని రహానె చెప్పాడు. ‘ఆల్‌రౌండర్ హార్దిక్ టీమ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం మునుపటి టచ్ కోసం బాగా కష్టపడుతున్నాడు. తుది జట్టులో ఉంటాడా.. బౌలింగ్ వేస్తాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేను. అక్షర్ పటేల్ కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ఫైనల్ ఎలెవన్‌లో ఎవరెవరు ఉంటారనేది ఇంకా నిర్ణయించలేదు. రేపు (గురువారం) మరో ప్రాక్టీస్ సెషన్ ఉంది. ఆ తర్వాతే టీమ్ కాంబినేషన్‌పై క్లారిటీ వస్తుంది. ఎంతమంది స్పిన్నర్లతో బరిలోకి దిగుతామనేది కూడా అప్పుడే తెలుస్తుంది. ఇండియాలో వికెట్లు జనరల్‌గా స్పిన్‌కు సహకరిస్తాయి. కానీ చెపాక్ వికెట్ ఎలా రెస్పాండ్ అవుతుందనేది తెలియాలంటే మ్యాచ్ తొలి రోజు వరకు వెయిట్ చెయ్యాల్సిందే’ అని రహానె పేర్కొన్నాడు.
మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం..
బయో ఎన్విరాన్మెంట్‌లో ఉంటున్నప్పటికీ టీమ్ అంతా మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉందని అజింక్యా చెప్పాడు. ‘నెలల తరబడి బయో బబుల్‌లో ఉన్నప్పటికీ మేము(టీమ్) మెంటల్‌గా స్ట్రాంగ్‌గానే ఉన్నాం. టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా ఉంటుంది. పైగా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాతోనే ఉన్నారు. ఇక, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బౌలర్లను ఐపీఎల్‌లో దగ్గరగా చూడటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. టీ20లకు టెస్ట్‌లకు అసలు సంబంధం లేదు. బౌలింగ్ లెంగ్త్‌లు, ఆటలో పరిస్థితులు మొత్తం వేరుగా ఉంటాయి. పైగా ఫారిన్ ప్లేయర్లతో లిమిట్స్‌లోనే ఉంటాము’ అని వైస్ కెప్టెన్ అజింక్యా చెప్పుకొచ్చాడు.
For More News..