BMW Twitter Review : ట్రెండింగ్లో ‘రవితేజ ఈజ్ బ్యాక్’.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టాక్ ఎలా ఉందంటే?

BMW Twitter Review : ట్రెండింగ్లో  ‘రవితేజ ఈజ్ బ్యాక్’.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టాక్ ఎలా ఉందంటే?

మాస్ మహారాజా రవితేజ హీరోగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా మంగళవారం (2026 జనవరి13న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూకే, అమెరికాల్లో ప్రీమియర్ షోలు పూర్తవగా, తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ షోలు కూడా ముగిశాయి.

ఈ క్రమంలో ప్రీమియర్ షోలకు వస్తున్న టాక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ముఖ్యంగా ఓవర్సీస్‌లోని ఎన్ఆర్ఐ ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకున్నారు? కథ ఎంతవరకు వర్క్ అయ్యింది? రవితేజ కామెడీ,  ప్రేక్షకులను ఎంతగా నవ్వించింది? ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో రవితేజ నిజంగా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడా? లేదా ? అనేది X (గతంలో ట్విట్టర్) రివ్యూలో తెలుసుకుందాం.

ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి వస్తున్న టాక్ ప్రకారం.. ఈ సినిమాకు పాజిటివ్ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా రవితేజ ఎనర్జీ సూపర్బ్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో “రవితేజ ఈజ్ బ్యాక్” అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తూ.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా, ఈ సినిమాలో మాస్ మహారాజా ఎనర్జీ, టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బలంగా ఉన్నాయనే అభిప్రాయం విస్తృతంగా వినిపిస్తోంది.

అయితే, సినిమా కథ ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కామెడీ సన్నివేశాలు బాగా వర్క్ అయ్యాయని ఓవర్సీస్ ఆడియన్స్ చెబుతున్నారు. కొన్ని చోట్ల పేస్ కొద్దిగా నెమ్మదించినా, మొత్తం మీద ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే..సెకండాఫ్లో సినిమా కొంచెం స్లో అయిందని, కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా ఉందని అంటున్నారు. అలాగే, స్క్రీన్ ప్లే, కథను నడిపించడంలో డైరెక్టర్ కిశోర్ తిరుమల తడబడ్డారని, మూవీ క్లైమాక్స్ ఇంకా బలంగా ఉంటే.. సినిమా బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

సినిమా చూసిన ఓక నెటిజన్ తన రివ్యూ షేర్ చేస్తూ.. “అబ్బా.. ఏమి టైమింగ్ రా! ఏమి ఎనర్జీ ! ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో రవితేజ మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు. కామెడీ మాత్రం ‘నెక్స్ట్ లెవల్’ అనాలి మిగతా సినిమాల గురించీ ఆలోచించక్కర్లేదు. సూటిగా థియేటర్‌కి వెళ్లి ఈ ఫుల్-ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎంజాయ్ చేయండి! బ్లాక్‌బస్టర్ హిట్.. ఫన్ మిస్ చేయకండి!” అని తనదైన శైలిలో రివ్యూ పంచుకున్నారు. 

మరో నెటిజన్ తన రివ్యూ పంచుకుంటూ.. “ఈ సినిమా ఒక ఎంటర్‌టైనర్‌లా మొదలవుతుంది. కానీ కథ మాత్రం చాలా పలుచగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే ఇప్పటికే ఎన్నోసార్లు చూసినట్టే అనిపిస్తుంది. దర్శకుడు కిశోర్ తిరుమల ఫస్టాఫ్ లో కొన్ని కామెడీ సన్నివేశాలను బాగానే పండించాడు. అవే సినిమాకు ప్లస్ పాయింట్స్. కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి సినిమా లాగుతూ సాగుతుంది. క్లైమాక్స్ కూడా అంతగా ప్రభావం చూపదు. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే కొన్ని కామెడీ బిట్స్ ఉన్నా, మొత్తం భాగం మాత్రం సగటుగానే అనిపిస్తుంది.

రవి తేజ తన గత సినిమాలతో పోలిస్తే ఇందులో కొంచెం బెటర్‌గా కనిపించాడు. అయినా కూడా ఈ సినిమా పూర్తిగా బలమైన కథనంతో ముందుకు వెళ్లదు. కథలో సరైన బలం, స్పష్టత లేకపోవడం ప్రధాన లోపం. మొత్తానికి.. ఈ సినిమా “బిలో అవరేజ్” నుంచి “ఒకసారి చూడవచ్చు” అనే రేంజ్‌లోనే నిలుస్తుంది” అని తెలిపారు.

ఓవరాల్గా.. రవితేజ మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్‌‌‌‌తో కూడిన ఫుల్ లెంగ్త్  ఫ్యామిలీ డ్రామాగా దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందించాడని, లేటెస్ట్ సోషల్ మీడియా సెన్సేషనల్ హీరోయిన్లు ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతిలతో రవితేజ కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ అంటున్నారు. వీరితో రవితేజ చేసిన ఫన్, రొమాంటిక్ విజువల్స్ ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చేలా ఉండటం, కమెడియన్ సత్య కామెడీ ట్రాక్, మరో సాంగ్ ఆడియన్స్లో ఫుల్ జోష్ నింపాయని నెటిజన్లు ట్వీట్స్ పెడుతున్నారు. ఈ సినిమాతో రవితేజ హిట్ కొట్టడం కన్ఫామ్ అని ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి బలమైన టాక్ ఊపందుకుంది.

మాస్ మహారాజ రవితేజ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కానీ, అంతేస్థాయిలో వరుస ఫెయిల్యూర్స్ అందుకుంటున్నారు. ఇటీవలే మాస్ జాతరతో వచ్చిన రవితేజ, ప్రేక్షకుల్ని ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో.. తనకి అచ్చొచ్చిన కామెడీ ఎంటర్ టైనర్తో ఆడియన్స్ని పలకరించడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి.