Taapsee Pannu: ప్రమోషన్స్ కోసం ఇతరులపై విషం చిమ్ముతున్నారా?.. బాలీవుడ్ పబ్లిసిటీ కల్చర్‌పై తాప్సీ పన్ను ఫైర్!

Taapsee Pannu: ప్రమోషన్స్ కోసం ఇతరులపై విషం చిమ్ముతున్నారా?.. బాలీవుడ్ పబ్లిసిటీ కల్చర్‌పై తాప్సీ పన్ను ఫైర్!

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ తో కలిసి ' ఝుమ్మంది నాదం' అంటూ  అల్లరిగా తెలుగు తెరపై అడుగుపెట్టిన కర్లీ హెయిర్ బ్యూటీ తాప్సీ పన్ను. గ్రామర్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ కర్లీ హెయిర్ భామ అగ్రహీరోలతో నటించి మెప్పించింది. వరుస అవకాశాలు దక్కిం చుకుంటూ.. టాప్ హీరోయిన్ గా ఎదిగింది.  ఆ తర్వాత బాలీవుడ్ బాటపట్టి అగ్ర నటీమణులలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ‘పింక్’, ‘తాప్పాడ్’, ‘శభాష్ మిథు’ వంటి చిత్రాలతో నటనలో తన సత్తా చాటారు. 

పీఆర్ అంటే ఇతరులను తొక్కేయడమా?

అయితే, ఇటీవల కాలంలో సినిమాల కంటే తన ముక్కుసూటి తనంతోనే తాప్సీ వార్తల్లో నిలుస్తున్నారు. లేటెస్ట్ గా బాలీవుడ్ పబ్లిసిటీ కల్చర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ అంటే కేవలం తమ సినిమా గొప్పతనాన్ని చెప్పుకోవడం మాత్రమే కాదని, ఇతరులను తక్కువ చేసి చూపించడం కూడా ఒక భాగమైపోయిందని తాప్సీ ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో బాలీవుడ్ పీఆర్ (Public Relations) వ్యూహాలు మరో స్థాయికి చేరాయి. ఇప్పుడున్నది ఆరోగ్యకరమైన పోటీ కాదు. మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి, అదే సమయంలో ఇతరులను కిందకు లాగడానికి పీఆర్ టీమ్స్‌కు భారీగా డబ్బులు చెల్లిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

‘డర్టీ గేమ్స్’ ఆడుతూ..

కొన్ని పీఆర్ సంస్థలు తమ క్లయింట్స్ కోసం ఇతర నటులపై నెగటివ్ వార్తలు రాయించడం, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయించడం వంటి ‘డర్టీ గేమ్స్’ ఆడుతున్నాయని తాప్సీ విమర్శించారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ, ఇతరులపై నిందలు వేసి హైప్ క్రియేట్ చేయాలనుకోవడం తప్పుదారి పట్టించే విధానం అని అన్నారు. ఇలాంటి పీఆర్ యుద్ధాలకు నేను చాలా దూరం అని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాప్సీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ.. తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

 పెళ్లి తర్వాత తగ్గిన జోరు..

వరుసగా స్టార్ హీరోలతో నటిస్తూనే, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతో బాలీవుడ్ ‘క్వీన్’ అనిపించుకున్న తాప్సీ..  వివాహం తర్వాత సినిమాల ఎంపికలో వేగం తగ్గించారు. అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన ‘ఖేల్ ఖేల్ మే’ తర్వాత ఆమె కొంత విరామం తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘గాంధారి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దేవాశిష్ సుబీజా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

స్టార్ ఇమేజ్, సోషల్ మీడియా వైరల్ కంటెంట్ మాత్రమే సినిమా భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని భావించే ఈ రోజుల్లో, తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..  నిజాయితీగా చేసిన సినిమా మాత్రమే ప్రేక్షకుల మనసు గెలుస్తుంది అనే ఆమె నమ్మకానికి నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతున్నారు. సినిమా హిట్ కావాలంటే కావాల్సింది ‘కంటెంట్’ కానీ, ఇలాంటి పెయిడ్ ‘కాంట్రవర్సీలు’ కాదని  అభిప్రాయపడుతున్నారు.