మన అమ్మాయిలు మళ్లీ గెలిచారు.. కబడ్డీ ప్రపంచ కప్‌ విజేతగా భారత్‌

మన అమ్మాయిలు మళ్లీ గెలిచారు.. కబడ్డీ ప్రపంచ కప్‌ విజేతగా భారత్‌

బంగ్లాదేశ్: ఢాకాలో జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచ కప్ ఫైనల్లో చైనీస్ తైపీని 35–28 తేడాతో ఓడించి భారత మహిళల కబడ్డీ జట్టు విజేతగా నిలిచింది. ఈ విజయంతో కబడ్డీ ప్రపంచ కప్‌ విజేతగా భారత్‌ రెండో సారి సత్తా చాటింది. ఈ టోర్నమెంట్ మొత్తం భారత జట్టు మంచి ఫామ్ కనబర్చింది. గ్రూప్ మ్యాచ్‌లన్నింటినీ గెలిచి సెమీ -ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్లో ఇరాన్‌ను 33–21తో ఓడించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. చైనీస్ తైపీ కూడా తమ గ్రూప్‌లో గొప్ప ప్రతిభను కనబర్చింది. సెమీ ఫైనల్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌ను 25–18తో ఓడించింది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 11 దేశాలు పాల్గొన్నాయి.

ఈ సంవత్సరం ఆట ఏదైనా.. భారత క్రీడాకారిణులు అద్భుతంగా రాణిస్తున్నారు. ఆల్‌‌రౌండ్‌‌ షోతో ఆకట్టుకున్న ఇండియా విమెన్స్‌‌ టీమ్‌‌.. తొలి అంధుల (బ్లైండ్​) టీ20 వరల్డ్‌‌ కప్‌‌ను గెలుచుకుంది. ఆదివారం కొలంబోలోని పి. సర్వణముత్తు స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇండియా 7 వికెట్ల తేడాతో నేపాల్‌‌పై గెలిచింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన నేపాల్‌‌ 20 ఓవర్లలో 114/5 స్కోరు చేసింది.

2005, 2017, 2020 (టీ20 కప్‌‌‌‌‌‌‌‌)లో చివరి మెట్టుపై బోల్తా పడిన చేదు అనుభవాలను చెరిపేస్తూ.. అబ్బాయిలకేం తక్కువ కాదన్నట్టుగా నిరూపిస్తూ.. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో మన అమ్మాయిలు జగజ్జేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఓపెనర్ షెఫాలీ వర్మ (78 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 87; 2/36),  దీప్తి శర్మ (58 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 58; 5/39) ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్ మెరుపులతో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని టీమిండియా 52  రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది.