వన్డే సిరీస్‌‌లో ఆస్ట్రేలియా ‌–ఎ జట్టుపై ఇండియా విమెన్స్‌‌–ఎ టీమ్ బోణీ

వన్డే సిరీస్‌‌లో ఆస్ట్రేలియా ‌–ఎ జట్టుపై ఇండియా విమెన్స్‌‌–ఎ టీమ్ బోణీ

బ్రిస్బేన్‌‌: ఆస్ట్రేలియా విమెన్స్‌‌–ఎతో జరుగుతున్న మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌లో ఇండియా విమెన్స్‌‌–ఎ జట్టు బోణీ చేసింది. యాస్తికా భాటియా (59) హాఫ్‌‌ సెంచరీకి తోడు రాధా యాదవ్‌‌ (3/45), టిటాస్‌‌ సాధూ (2/37), మిన్ను మణి (2/38) బౌలింగ్‌‌లో మెరవడంతో.. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌‌లో ఇండియా 3 వికెట్ల తేడాతో కంగారూలపై గెలిచింది. ఫలితంగా సిరీస్‌‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్‌‌ నెగ్గిన ఆసీస్‌‌ 47.5 ఓవర్లలో 214 రన్స్‌‌కు ఆలౌటైంది.

 అనికా లియరాయిడ్ (92), రాచెల్ ట్రెనామన్ (51) చెలరేగారు. నికోల్ ఫాల్టమ్ (18), అలీసా హీలీ (14)తో సహా మిగతా వారు నిరాశపర్చారు. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా 42 ఓవర్లలో 215/7 స్కోరు చేసి గెలిచింది. యాస్తిక, షెఫాలీ వర్మ (36), ధారా గుజ్జర్‌‌ (31) కలిపి 157 రన్స్‌‌ జోడించారు. చివర్లో రాఘవి బిస్త్‌‌ (25 నాటౌట్‌‌), రాధా యాదవ్‌‌ (19) వేగంగా ఆడారు.