
బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్,ఆసీస్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ ను ఓడించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని భారత్ 26.4 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి ఛేదించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (7/42), అశ్విన్ (3/59) ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 263 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 262 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పోయింది. దీంతో 4 టెస్టుల సిరీస్ లో టీమిండియా 20తో ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ మార్చి1న ఇండోర్ లో స్టార్ట్ కానుంది.