వేట షురూ.. అండర్‌‌‌‌‌‌‌‌19 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియా బోణీ

వేట షురూ.. అండర్‌‌‌‌‌‌‌‌19 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియా బోణీ
  •   84 రన్స్‌‌‌‌తో బంగ్లాపై గ్రాండ్ విక్టరీ   
  •   రాణించిన ఆదర్శ్, సౌమీ

బ్లూమ్‌‌‌‌ఫోంటైన్ (సౌతాఫ్రికా): ఆరోసారి చాంపియన్‌‌‌‌గా నిలవడమే టార్గెట్‌‌‌‌గా  అండర్‌‌‌‌‌‌‌‌19 వన్డే వరల్డ్ కప్‌‌‌‌లో బరిలోకి దిగిన యంగ్ ఇండియా ఘన విజయంతో టోర్నమెంట్‌‌‌‌ను ఆరంభించింది. బ్యాటింగ్‌‌‌‌లో ఆదర్శ్ సింగ్ (96 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లతో 76), కెప్టెన్ ఉదయ్ సహరన్ (94 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లతో 64), బౌలింగ్‌‌‌‌లో సౌమీ పాండే (4/24) విజృంభించడంతో శనివారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ తొలి మ్యాచ్‌‌‌‌లో 84 రన్స్‌‌‌‌ తేడాతో బంగ్లాదేశ్‌‌‌‌ను చిత్తు చేసింది.

గత డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో అండర్‌‌‌‌‌‌‌‌19 ఆసియా కప్ సెమీస్‌‌‌‌లో ఓటమికి బంగ్లాపై ప్రతీకారం తీర్చుకుంది.  ఏకపక్ష మ్యాచ్‌‌‌‌లో తొలుత ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 రన్స్‌‌‌‌ చేసింది. ఆదర్శ్‌‌‌‌, ఉదయ్‌‌‌‌తో పాటు తెలంగాణ కుర్రాడు అవనీశ్ (26), సచిన్ దాస్ (26 నాటౌట్‌‌‌‌) రాణించారు. బంగ్లా బౌలర్లలో మరూఫ్ మ్రిదా (5/43) ఐదు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేజింగ్‌‌‌‌లో బంగ్లా  45.5 ఓవర్లలో  167 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. షిహబ్ జేమ్స్‌‌‌‌ (54), ఆరిఫుల్ ఇస్లాం (41) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. సౌమీ పాండేతో పాటు ముషీర్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆదర్శ్‌‌‌‌కు ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 25న జరిగే తర్వాతి మ్యాచ్‌‌‌‌లో ఐర్లాండ్‌‌‌‌తో ఇండియా పోటీ పడుతుంది.

ఆదుకున్న ఆదర్శ్, ఉదయ్

టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఇండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అర్శిన్ కులకర్ణి (7)తో పాటు ముషీర్ ఖాన్ (3) నిరాశ పరచడంతో  31/2తో డీలా పడింది. ఈ దశలో ఆదర్శ్‌‌‌‌, ఉదయ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను చక్కదిద్దారు. జాగ్రత్తగా బ్యాటింగ్‌‌‌‌ చేస్తూనే క్రమం తప్పకుండా బౌండ్రీలు కొడుతూ స్కోరు వంద దాటించారు.

ఈ క్రమంలో ఇద్దరూ ఫిఫ్టీలు కూడా పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్‌‌‌‌కు 116 రన్స్‌‌‌‌ జోడించిన తర్వాత  ఈ ఇద్దరూ వెంటవెంటనే ఔటయ్యారు. బంగ్లా బౌలర్ మారుఫ్ వరుసగా వికెట్లు తీస్తున్నా ఇండియా  మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు తలో చేయి వేశారు. ఓ ఫోర్, సిక్స్‌‌‌‌తో వేగంగా ఆడిన అవనీశ్‌‌‌‌ ఐదో వికెట్‌‌‌‌కు  ప్రియాన్షు (23)తో  33 రన్స్ జోడించాడు.  చివర్లో ధాటిగా ఆడిన సచిన్‌‌‌‌ దాస్‌‌‌‌ స్కోరు 250 మార్కు దాటించాడు. 

బంగ్లా ఢమాల్ 

నార్మల్ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో బంగ్లా ఏ దశలోనూ ఇండియాకు పోటీ ఇవ్వలేకపోయింది. ఎనిమిదో ఓవర్లో ఓపెనర్‌‌‌‌‌‌‌‌ జీషన్ ఆలమ్ (14)ను ఔట్‌‌‌‌ చేసిన లింబానీ ఆ టీమ్ పతనాన్ని ఆరంభించాడు.  ఆ వెంటనే వరుస ఓవర్లలో రిజ్వాన్ (0), అషిఖుర్ (14)ను సౌమీ పెవిలియన్ చేర్చాడు. అర్షిన్ బౌలింగ్‌‌‌‌లో అమిన్ (5) వెనుదిరిగాడు. మధ్యలో ఆరిఫుల్, జేమ్స్‌‌‌‌ ఐదో వికెట్‌‌‌‌కు 77 రన్స్‌‌‌‌ జోడించి ఆశలు రేపారు. 35వ ఓవర్లో ఆరిఫుల్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి ముషీర్ ఈ జోడీని విడదీసిన తర్వాత బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ కుప్పకూలింది. కెప్టెన్‌‌‌‌ రహ్మన్ రబ్బీ (4), బర్సోన్ (0), ఇక్బాల్ ఎమోన్ (0) పెవిలియన్‌‌‌‌కు క్యూ కట్టడంతో  ఇండియా భారీ తేడాతో గెలిచింది. 

సంక్షిప్త స్కోర్లు 
ఇండియా: 50 ఓవర్లలో 251/7 (ఆదర్శ్ 76, ఉదయ్ 64, మారుఫ్ 5/43).
బంగ్లాదేశ్: 45.5 ఓవర్లలో 167 ఆలౌట్‌‌‌‌ (షిహద్ 54, ఆరిఫుల్ 41, సౌమీ 4/24).