ఎఫ్‌‌‌‌ఐహెచ్‌‌‌‌ ప్రొ లీగ్‌‌‌‌లో ఇండియా బోణీ

ఎఫ్‌‌‌‌ఐహెచ్‌‌‌‌ ప్రొ లీగ్‌‌‌‌లో ఇండియా బోణీ

అంట్వెర్ప్‌‌‌‌ (బెల్జియం): ఎఫ్‌‌‌‌ఐహెచ్‌‌‌‌ ప్రొ లీగ్‌‌‌‌లో ఇండియా బోణీ చేసింది. బుధవారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఇండియా 5–4 (షూటాఫ్‌‌‌‌)తో అర్జెంటీనాపై నెగ్గింది. ఇండియా తరఫున మన్‌‌‌‌దీప్‌‌‌‌సింగ్‌‌‌‌ (11వ ని), లలిత్‌‌‌‌ కుమార్‌‌‌‌ గోల్స్‌‌‌‌ చేయగా, లుకాస్‌‌‌‌ మార్జినెజ్‌‌‌‌ (20వ ని), టోమస్‌‌‌‌ డొమెని (60వ ని) అర్జెంటీనాకు గోల్స్‌‌‌‌ అందించారు. దీంతో నిర్ణీత టైమ్‌‌‌‌లో ఇరుజట్లు చెరో రెండు గోల్స్‌‌‌‌ చేయడంతో షూటాఫ్‌‌‌‌ నిర్వహించారు. ఇందులో కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ సింగ్‌‌‌‌, సుఖ్‌‌‌‌జీత్‌‌‌‌ సింగ్‌‌‌‌ చెరో 2 గోల్స్‌‌‌‌ కొట్టగా, అభిషేక్‌‌‌‌ ఓ గోల్‌‌‌‌ సాధించాడు. మరోవైపు విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ 0–5తో అర్జెంటీనా చేతిలో ఓడింది.