కుర్రాళ్ల జోరు..మూడో టీ20లోనూ ఇండియా గెలుపు

కుర్రాళ్ల జోరు..మూడో టీ20లోనూ ఇండియా గెలుపు
  • ఫిఫ్టీతో మెరిసిన కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • రాణించిన గైక్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • 23 రన్సే తేడాతో ఓడిన జింబాబ్వే

హరారే : జింబాబ్వే టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓటమి తర్వాత బలంగా పుంజుకున్న టీమిండియా వరుసగా రెండో విక్టరీ అందుకుంది. కెప్టెన్ శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ గిల్ (49 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 66), రుతురాజ్ గైక్వాడ్ (28 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్ల, 3 సిక్సర్లతో 49) మెరుపులకు తోడు బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుందర్ (3/15), అవేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2 /39) విజృంభించడంతో  బుధవారం జరిగిన మూడో టీ20లో  23  రన్స్ తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది.  

టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 182/4 స్కోరు చేసింది.  కె, యశస్వి జైస్వాల్ (27 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36) రాణించారు. ఆతిథ్య బౌలర్లలో ముజరబాని, సికందర్ రజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జింబాబ్వే ఓవర్లన్నీ ఆడి 159/6 స్కోరు మాత్రమే చేసి ఓడింది. డియోన్ మైయర్స్ (49 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 69 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), క్లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మడాండె (37) పోరాడినా ఫలితం లేకపోయింది.  సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. శనివారం నాలుగో టీ20 జరుగుతుంది. 

ఇండియా దూకుడు

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్క మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ఆడే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాని యశస్వి  జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌... కెప్టెన్ గిల్ జతగా ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చి తొలి వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 67 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడించాడు. తొలి ఓవర్లోనే 4, 4, 6తో జైస్వాల్ దూకుడు చూపెట్టాడు. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గరవ వేసిన రెండో ఓవర్లో గిల్ సైతం రెండు ఫోర్లు సిక్సర్లతో అలరించాడు. చతార బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జైస్వాల్ 4, 6 .. ముజరబాని ఓవర్లో  గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4, 4 కొట్టడంతో 4.1 ఓవర్లలోనే స్కోరు యాభై దాటింది. కానీ, పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లే తర్వాత బౌలర్లు పొదుపుగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఇండియా స్పీడుకు బ్రేకులు వేశాడు.

చతార వేసిన ఎనిమిదో ఓవర్లో జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరుస క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆతిథ్య ఫీల్డర్లు వదిలేశారు. ఈ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సద్వినియోగం చేసుకోలేకపోయిన జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌... రజా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బెనెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చి వెనుదిరిగాడు. గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ హీరో అభిషేక్ శర్మ (10)ను కూడా రజా ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో 11 ఓవర్లకు ఇండియా 83/2తో నిలిచింది.  ముజరబాని వేసిన తర్వాతి ఓవర్లో ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మళ్లీ స్పీడు పెంచగా.. నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ ఆరంభం నుంచే భారీ షాట్లతో చెలరేగాడు.  మధెవెరె బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టగా.. గైక్వాడ్ 6,4  బాదడంతో స్కోరు వంద దాటింది.

చతార బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 36 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 16వ ఓవర్లో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గరవ మూడు రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చినా రజా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గైక్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరో సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా 18 రన్స్ పిండుకున్నారు. ముజరబాని బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గిల్ పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరినా.. 19వ ఓవర్లో శాంసన్ (12 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  రుతురాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6, 4 బాదారు. ఆఖరి ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐదో బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఔటైన గైక్వాడ్ కొద్దిలో ఫిఫ్టీ చేజార్చుకోగా.. శాంసన్ ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షినిషింగ్ టచ్ ఇచ్చాడు.

జింబాబ్వే ఢమాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జింబాబ్వే ఆరు ఓవర్లలోనే సగం వికెట్లు కోల్పోయి డీలా పడింది. డియాన్ మైయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోరాటం ఫలితం ఇవ్వలేకపోయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెస్లే మధెవెరె (1)ను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన అవేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆ జట్టు పతనాన్ని ఆరంభించాడు. ఖలీల్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దూబేకు క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చి మరో ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరుమని (13) వెనుదిరగ్గా.. తన తర్వాతి ఓవర్లోనే బ్రియాన్ బెనెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (4)ను అవేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెనక్కుపంపాడు. కెప్టెన్ సికందర్ రజా (15) ప్రతిఘటనతో  పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేను జింబాబ్వే 37/3తో ముగించింది.

కానీ, ఫీల్డింగ్ మారిన తర్వాత  బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన స్పిన్నర్ సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఒకే ఓవర్​లో రజాతో పాటు క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెల్ (1)వికెట్లు పడగొట్టడంతో హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 39/5తో ఎదురీత మొదలు పెట్టింది.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ దశలో డియోన్ మైయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  క్లైవ్ మడాండె ఇండియా బౌలర్లపై అనూహ్యంగా ఎదురుదాడికి దిగారు. భారీ షాట్లతో ఫోర్లు, సిక్సర్లు రాబట్టడంతో 15 ఓవర్లకు 110/5తో నిలిచిన జింబాబ్వే రేసులోకి వచ్చేలా కనిపించింది.

అయితే, తర్వాతి ఓవర్లో ఖలీల్ రెండే రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వగా.. మడాండెను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన సుందర్ ఆరో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 77 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రేక్ చేసి ఇండియా విజయం ఖాయం చేశాడు. మసకజ్ద (18 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)తో కలిసి మైయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివరి రెండు ఓవర్లలో మెరుపులు మెరిపించినా ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాడు.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా : 20 ఓవర్లలో  182/4 (గిల్ 66, గైక్వాడ్ 49, రజా 2/24).
జింబాబ్వే :  20 ఓవర్లలో 159/6  (మైయర్స్ 65*, మదాండె 37, సుందర్ 3/15).