12 పరుగుల తేడాతో టీమిండియా విజయం

12 పరుగుల తేడాతో టీమిండియా విజయం

12 పరుగుల తేడాతో విజయం

ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 


మైఖేల్ బ్రాస్‌వెల్ సెంచరీ

న్యూజిలాండ్ బ్యాటర్ మైఖేల్ బ్రాస్‌వెల్ బాదేశాడు. 57 బంతుల్లోనే అతడు సెంచరీ కొట్టాడు. 

సగం వికెట్లు కోల్పోయిన కివీస్


350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ జట్టు సగం వికెట్లను కోల్పోయింది. 25 ఓవర్లకు కివీస్ 5 వికెట్లను కోల్పోయి 130 పరుగులు చేసింది. ప్రస్తుతం  మైఖేల్ బ్రాస్‌వెల్ (1), టామ్‌ లేథమ్‌ (17) క్రీజులో ఉన్నారు.  అంతకుముందు కివీస్ ఓపెనర్లు తడబడ్డారు. ఓపెనర్ డేవాన్‌ కాన్వే (10) పరుగులకే సిరాజ్ బౌలింగ్ లో వెనుదిరగగా, దూకుడగా ఆడిన మరో  ఓపెనర్ ఫిన్‌ అలెన్ (40) కూడా త్వరగానే ఔటయ్యాడు. ఆ తరువాత కాసేపటికే హెన్రీ నికోల్స్‌ (18), హెన్రీ నికోల్స్‌ (18), గ్లెన్‌ ఫిలిప్స్‌ (11) వెనువెంటనే ఔటయ్యిరు. టార్గెట్ సగం ఫినిష్ చేయకముందే కివీస్  సగం వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 

న్యూజిలాండ్ టార్గెట్ 350

ఉప్పల్ వన్డే మ్యాచ్ లో టీమిండియా  ఓపెనర్ బ్యాట్స్మెన్  శుభ్‌మన్‌ గిల్  రెచ్చిపోయి ఆడాడు. ఓపెనర్ గా క్రీజ్ లోకి వచ్చిన గిల్..  చివరి వరకు క్రీజ్లో ఉండి ఏకంగా డబుల్ సెంచరీ బాదాడు. వరుసగా బౌండరీలు బాదుతూ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.  145 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన గిల్..   డబుల్ సెంచరీకి ముందు మూడు సిక్సర్లు బాదాడు. గిల్ ఇన్నింగ్స్ లో మొత్తం19 ఫోర్లు, 9 సిక్స్‌లున్నాయి. గిల్ కు ఇదే ఫస్ట్ డబుల్ సెంచరీ కాగా ఇండియా తరుపున  డబుల్ సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా గిల్ నిలిచాడు. 

వరుస సిక్సర్లు. గిల్ డబుల్ సెంచరీ

ఫెర్గుసన్ వేసిన 48.1 ఓవర్లో మొదటి మూడు బంతుల్ని సిక్సర్లుగా మలిచిన గిల్ 200 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో గిల్ కి ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్.

షార్దూల్ రన్ ఔట్

ఆల్ రౌండర్ షార్దూల్ ఠాకూర్ రన్ ఔట్ అయ్యాడు. ఫెర్గుసన్ వేసిన 46.4 బంతిని కవర్ డ్రైవ్ ఆడిన గిల్ రన్ కి ప్రయత్నిస్తాడు. చురుకుగా స్పందిచిన సాంట్నర్ లాథమ్ కి బాల్ అందించడంతో షార్దూల్ రన్ ఓట్ అవుతాడు.

టీమిండియా 300

శుభ్ మన్ గిల్ సూపర్ ఇన్నింగ్స్ తో నిలబడటంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి దాటిగా ఆడిన గిల్ కు భారత  బ్యాటర్ల  సపోర్ట్  లభించలేదు. అయినా, వెనకడుగు వేయకుండా న్యూజిలాండ్ బౌలర్లకు ఎదురుకున్నాడు.

నిలబడని సుందర్

ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ శుభ్‌మన్‌ తో కలిసి వికెట్ల పతనాన్ని ఆపుతాడనుకుంటే తక్కువ పరుగులకే (12) వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 44.6 ఓవర్ వద్ద షిప్లే బౌలింగ్ లో ఎల్ బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.  

గిల్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ 

టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ అదరగొడుతున్నాడు. వన్డేల్లో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ నమోదు చేశాడు.  మైఖేల్ బ్రాస్‌వెల్ వేసిన 42.4వ ఓవర్‌ లో  సిక్స్ కొట్టి150 పరుగుల మార్క్ దాటాడు.

హార్దిక్ పాండ్యా ఔట్

వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 28 పరుగులకే వెనుదిరిగాడు. మిచెల్ వేసిన 39.4 ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హార్దిక్ ఉన్నంతసేపు గిల్ కి సపోర్ట్ గా నిలబడ్డాడు.

టీమిండియా 250

శుభ్ మన్ గిల్ సూపర్ ఇన్నింగ్స్ తోడవడంతో భారత్ భారీ స్కోర్ దిశగా పరుగులు పెడుతోంది. గిల్ కి తోడుగా హార్దిక్ తోడవడంతో భారత్ 250 పరుగుల మార్క్ దాటింది.  ప్రస్తుతం క్రీజ్ లో గిల్ (134), పాండ్యా (28) ఉన్నారు. 

క్యాచ్ డ్రాప్

సెంచరీ చేసి ఊపు మీదున్న గిల్ క్యాచ్ ని డ్రాప్ చేశారు న్యూజిలాండ్ ఆటగాళ్లు. షిప్లీ వేసిన 37.3 ఓవర్లో నేరుగా బౌలర్ కి క్యాచ్ ఇచ్చాడు. షిప్లీ వైపు దూసుకొస్తున్న బంతి ఎడమ చేత్తో క్యాచ్ అందుకోబోయాడు. కానీ, బాల్ బొటన వేలికి తాకి నేలపాలయ్యింది. దాంతో ఊపిరిపీల్చుకున్న గిల్, తరువాత బంతిని బౌండరీ పంపించాడు.

గిల్ సెంచరీ. వన్డేల్లో వెయ్యి పరుగులు

ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ 87 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇందులో14  ఫోర్లు, ఓ సిక్సు ఉంది. గిల్ కు ఇది వన్డేలో మూడో సెంచరీ కాగా స్వదేశంలో రెండవది. 106 పరుగుల వద్ద టిక్నర్ బౌలింగ్ లో ఫోర్ కొట్టిన గిల్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 1000 పరుగులు పూర్తిచేసుకున్నాడు. 

సూర్య కుమార్ ఔట్

గిల్ తో కలిసి ఇన్నింగ్స్ భారీ స్కోర్ సాధిస్తాడనుకున్న సూర్య 31 పరుగుల వద్ద మీడియం ఫేసర్ మిచల్ బౌలింగ్ లో సాంటర్న్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 65 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. సూర్య ఉన్నంతసేపు స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది.

50 పరుగుల పార్ట్నర్షిప్

ఓపెనర్ శుభ్ మన్ గిల్, ఐదో వికెట్లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ తో ఇన్నింగ్స్ చక్కబెడుతున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లను ధాటిగా ఆడుతూ స్కోర్  బోర్డ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో ఇద్దరు కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

టీమిండియా మూడో వికెట్ డౌన్

ఫెర్గుసన్ నిప్పుల బంతులకి ఇషాన్ కిషన్ నిలువలేకపోయాడు. 142.6 kph వేసిన బంతిని ఇషాన్ డిఫెండ్ చేయబోయి కీపర్ లాథమ్ కి క్యాచ్  ఇచ్చి ఔట్ అయ్యాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ కి తాకి కీపర్ చేతిలో పడింది. దీంతో టీమిండియా 3వ వికెట్ కోల్పోయింది. 

శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ

తడబడుతూ సాగుతున్న భారత ఇన్నింగ్స్ లో శుభ్ మన్ గిల్ నిలబడ్డాడు. ఆచితూచి ఆడుతూ సీనియర్ ప్లేయర్ తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎం బ్రేసెల్ బౌలిగ్ లో సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

విరాట్ కోహ్లీ ఔట్ 

టీమిండియా రెండు కీలక వికెట్లను కోల్పోయింది. దూకుుడుగా ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మ ( 34) పరుగుల వద్ద ఔట్ కాగా, మంచి ఫామ్‌లో ఉన్నవిరాట్‌ కోహ్లీ (8) కూడా ఔటయ్యాడు. 

10వ ఓవర్ : భారత్ స్కోరు 52/0

10వ ఓవర్లో 1 పరుగు లభించింది. కెప్టెన్ ఈ ఓవర్ స్పిన్నర్ సాంట్నర్ రి ఇచ్చాడు. ఈ ఓవర్ లో కేవలం ఒక పరుగే వచ్చింది. ఐదు బాల్స్ డాట్ చేసి రోహిత్ ని ఇబ్బంది పెట్టాడు. ప్రస్తుతం  రోహిత్ శర్మ (27), శుభ్ మన్ గిల్ (21) పరుగులతో క్రీజులో ఉన్నారు.

9వ ఓవర్ : భారత్ స్కోరు 51/0

9వ ఓవర్లో 8 పరుగులు లభించాయి. టిక్నర్ వేసిన మొదటి రెండు బాల్స్ డాట్ చేసిన గిల్..  మూడు, నాలుగు బంతుల్ని ఫోర్ గా మలిచాడు. ఐదు, ఆరు బంతులు డాట్ అవుతాయి.  ప్రస్తుతం  రోహిత్ శర్మ (26), శుభ్ మన్ గిల్ (21) పరుగులతో క్రీజులో ఉన్నారు.

8వ ఓవర్ : భారత్ స్కోరు 43/0

8వ ఓవర్లో 4 పరుగులు లభించాయి. ఫెర్గుసన్ వేసిన మొదటి బాల్ నుంచే రోహిత్ ను ఇబ్బంది పెట్టాడు. దానికి ప్రతి దాడి చేసిన రోహిత్  5వ బంతికి ఫోర్ కొట్టాడు.  ప్రస్తుతం  రోహిత్ శర్మ (26), శుభ్ మన్ గిల్ (13) పరుగులతో క్రీజులో ఉన్నారు.

7వ ఓవర్ : భారత్ స్కోరు 39/0

7వ ఓవర్లో 4 పరుగులు లభించాయి. టిక్నర్ వేసిన మొదటి బాల్ కి గిల్ సింగిల్ తీసి రోహిత్ శర్మకు స్ట్రైక్ ఇస్తాడు. ఈ ఓవర్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ సింగిల్స్ తీశారు. ప్రస్తుతం  రోహిత్ శర్మ (22), శుభ్ మన్ గిల్ (13) పరుగులతో క్రీజులో ఉన్నారు.

6వ ఓవర్ : భారత్ స్కోరు 35/0

6వ ఓవర్లో 4 పరుగులు లభించాయి. ఫెర్గుసన్ వేసిన మొదటి 5 బంతుల్ని డాట్ చేసిన గిల్ చివరి బంతికి ఫోర్ కొడతాడు.  ప్రస్తుతం  రోహిత్ శర్మ (20), శుభ్ మన్ గిల్ (12) పరుగులతో క్రీజులో ఉన్నారు

5వ ఓవర్ : భారత్ స్కోరు 31/0

5వ ఓవర్లో 7 పరుగులు లభించాయి. షిప్లే వేసిన మొదటి బంతి వైడ్ పోయింది.  తర్వాత మూడు బంతుల్ని మైడెన్ చేసిన రోహిత్ నాలుగో బంతిని సిక్స్ కొట్టాడు. తర్వాత రెండు బాల్స్ డాట్ అయ్యాయి. ప్రస్తుతం  రోహిత్ శర్మ (20), శుభ్ మన్ గిల్ (8) పరుగులతో క్రీజులో ఉన్నారు

4వ ఓవర్ : భారత్ స్కోరు 24/0


4వ ఓవర్లో 4  పరుగులు లభించాయి. ఫెర్గూసన్ వేసిన ఓవర్లో  గిల్  ఫోర్ బాదాడు.  ప్రస్తుతం  రోహిత్ శర్మ (14), శుభ్ మన్ గిల్ (8) పరుగులతో క్రీజులో ఉన్నారు

 

3వ ఓవర్ : భారత్ స్కోరు 20/0


3వ ఓవర్లో 10 పరుగులు లభించాయి. హెన్రీ షిప్లీ వేసిన ఓవర్లో  రోహిత్ శర్మ  ఫోర్, సిక్స్ బాదాడు.   ప్రస్తుతం  రోహిత్ శర్మ (14), శుభ్ మన్ గిల్ (4) పరుగులతో క్రీజులో ఉన్నారు

 

2వ ఓవర్ : భారత్ స్కోరు 10/0

రన్ రేట్ :5 

2వ ఓవర్లో 4 పరుగులు లభించాయి. ఫెర్గూసన్ వేసిన ఓవర్లో గిల్ ఫోర్ బాదాడు. .  ప్రస్తుతం  రోహిత్ శర్మ (4), శుభ్ మన్ గిల్ (4) పరుగులతో క్రీజులో ఉన్నారు

 

1వ ఓవర్ : భారత్ స్కోరు 6/0

రన్ రేట్ :6 

1వ ఓవర్లో 6 పరుగులు లభించాయి. హెన్రీ షిప్లీ వేసిన ఓవర్లో రోహిత్ శర్మ ఫోర్ కొట్టాడు. మరో  రెండు వైడ్స్ మాత్రమే వచ్చాయి.  ప్రస్తుతం  రోహిత్ శర్మ (4), శుభ్ మన్ గిల్ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు

 

ఉప్పల్ వన్డేలో టీమిండియా బరిలోకి దిగింది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లో తొలి వన్డే ఆడుతోంది.  శ్రీలంకతో వన్డే సిరీస్‌ను దక్కించుకున్న రోహిత్ శర్మ సేన..కివీస్పై కూడా  విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.  హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌కు హోమ్‌గ్రౌండ్‌లో కావడంతో..అందరి చూపి అతనిపైనే ఉంది. 

జట్లు ..

టీమిండియా తుది జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్  గిల్,  విరాట్  కోహ్లీ,  సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (కీపర్​), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్,  కుల్దీప్ యాదవ్, మహ్మద్  షమీ,  సిరాజ్, శార్దూల్ ఠాకూర్

న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తుది జట్టు: అలెన్, కాన్వే,  ‌‌‌‌‌నికోల్స్,  డారిల్​ మిచెల్,  లాథమ్ (కెప్టెన్, కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌),  ఫిలిప్స్, మిచెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్, శాంట్నర్,హెన్రీ షిప్లీ, టిక్నర్, ఫెర్గూసన్.