ఇండియా బ్యాటింగ్.. బంగ్లాతో మ్యాచ్ లో 2 మార్పులు

ఇండియా బ్యాటింగ్.. బంగ్లాతో మ్యాచ్ లో 2 మార్పులు

బర్మింగ్ హామ్ : ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నట్టు చెప్పాడు. లీగ్ దశ చివరకు చేరడంతో.. ఈ మ్యాచ్ లో గెలుపు ఓటములు మిగతా జట్లపైనా ప్రభావం చూపే చాన్సుంది.

జట్టులోకి భువీ… దినేష్ కార్తీక్ కు తొలి చాన్స్

ఈ మ్యాచ్ లో ఇండియా టీమ్ లో 2 మార్పులు జరిగాయి. కేదార్ జాదవ్ , కుల్దీప్ ల స్థానంలో దినేష్ కార్తీక్, భువనేశ్వర్ జట్టులోకి వచ్చారు. ముగ్గురు పేసర్లతో ఇండియా బరిలోకి దిగుతోంది. దినేష్ కార్తీక్ ఈ టోర్నీలోనే తొలిసారి తుదిజట్టుకు ఎంపికయ్యాడు.

భారత జట్టు ఇదే

లోకేశ్ రాహుల్

రోహిత్ శర్మ

విరాట్ కోహ్లీ – కెప్టెన్

రిషభ్ పంత్

దినేష్ కార్తీక్

ఎంఎస్ ధోనీ – వికెట్ కీపర్

హార్దిక్ పాండ్యా

భువనేశ్వర్ కుమార్

మహమ్మద్ షమీ

యుజ్వేంద్ర చాహల్

జస్ ప్రీత్ బుమ్రా

బంగ్లాదేశ్ తుది టీమ్ ఇదీ..

తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫిఖుర్ రహీమ్-వికెట్ కీపర్, సౌమ్య సర్కార్, మొసద్దెక్ హొస్సేన్, సబ్బిర్ రెహ్మాన్, మొహమ్మద్ సైఫుద్దీన్, మష్రాఫే మొర్తాజా -కెప్టెన్, రుబెల్ హొస్సేన్, ముస్తాఫిజుల్ రెహ్మాన్.