IARIలో ఇంటర్వ్యూలు.. ఎగ్జామ్ లేదు డైరెక్ట్ జాబ్.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

IARIలో ఇంటర్వ్యూలు.. ఎగ్జామ్ లేదు డైరెక్ట్ జాబ్.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ (ICAR IARI)  ప్రాజెక్ట్ అసోసియేట్ II పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావొచ్చు. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ప్లాంట్ పాథాలజీ/బయోటెక్నాలజీ/మాలిక్యులర్ బయాలజీలో మాస్టర్స్ డిగ్రీ లేదా బేసిక్ సైన్సెస్​లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి. పారిశ్రామిక, విద్యా సంస్థలు లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు, శాస్త్రీయ కార్యకలాపాలు, సేవల్లో పరిశోధన అభివృద్ధిలో రెండేండ్ల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 07.

లాస్ట్ డేట్: నవంబర్ 25. 

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: అర్హత కలిగిన అభ్యర్థులు 2025, నవంబర్ 28న ఉదయం 09:30 గంటలకు న్యూఢిల్లీలోని ఐసీఏఆర్ ఐఏఆర్ఐలోని
 డివిజన్ ఆఫ్ ప్లాంట్ పాథాలజీలో వాక్- ఇన్ -ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

పూర్తి వివరాలకు new.iari.res.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.