గ్రాండ్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే

గ్రాండ్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే

ఇండియన్ ఎయిర్  ఫోర్స్ డే సందర్భంగా నివాళులర్పించాయి త్రివిధ దళాలు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, భారత్ వైమానిక దళం చీఫ్ ఆర్కే ఎస్ భదౌరియా, నేవి చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్.. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర నివాళులర్పించారు. అమరుల సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిటర్స్ బుక్ లో సంతకం చేశారు తివిధ దళాల అధినేతలు.

భారత వైమానిక దళ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా IAF  సిబ్బందికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుభాకాంక్షలు చెప్పారు. జవాన్ల సేవలను కొనియాడుతూ ఆయన ట్వీట్ చేశారు. వైమానిక దళ కుటుంబాలను భారతావని గౌరవిస్తుంద్ననారు కోవింద్. అమరవీరులకు దేశం ఎప్పటికి రుణ పడి ఉంటుందన్నారు రాష్ట్రపతి. దేశ ప్రజలకు రక్షణలో IAF పాత్ర అద్భుతమని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. IAF సిబ్బంది, వారు కుటుంబాలకు ప్రధాని మోడీ విషెష్ చెప్పారు.