ఇంటరుతో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు: నెలకు 40వేల జీతం.. వెంటనే అప్లయ్ చేసుకోండి

ఇంటరుతో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు: నెలకు 40వేల జీతం.. వెంటనే అప్లయ్ చేసుకోండి

భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్నివీర్ వాయు  (02/2026)ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అవివాహితులైన పురుష, మహిళా అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 31.

పోస్టు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు  

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్ లేదా 10+2 ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్ సబ్జెక్టులో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.

కనీసం 50 శాతం మార్కులతో మెకానికల్/ ఎలక్ట్రిక ల్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్/కంప్యూటర్ సైన్స్/ ఇనుస్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మూడేండ్ల డిప్లొమాతోపాటు ఇంగ్లిష్ సబ్జెక్టులో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వంటి నాన్ ఒకేషనల్ సబ్జెక్టులతో రెండేండ్లు ఒకేషనల్ కోర్సులో ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్ సబ్జెక్టులో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్ (సైన్స్ కాని సబ్జెక్టులు)తోపాటు ఇంగ్లిష్ సబ్జెక్టులో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. 

వయోపరిమితి: 17.5 ఏండ్ల నుంచి 21 ఏండ్ల మధ్యలో ఉండాలి. అభ్యర్థులు 2005 జులై 02 నుంచి 2009 జనవరి మధ్యలో జన్మించి ఉన్న వారు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఒకవేళ అభ్యర్థి సెలెక్షన్ ప్రాసెస్లో అన్ని దశలు పూర్తి చేస్తే, నమోదు తేదీ నాటికి గరిష్ట వయోపరిమితి 21 ఏండ్లు ఉండాలి. 

మెడికల్ స్టాండర్డ్స్
ఎత్తు: పురుష, మహిళా అభ్యర్థులు కనీసం 152 సెం. మీ.ల ఎత్తు ఉండాలి. ఈశాన్య రాష్ట్రాలు లేదా ఉత్తరాఖండ్లోని పర్వత ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు 147 సెం.మీ.ల ఎత్తు ఉన్నా పరిగణనలోకి తీసుకుంటారు. పురుష అభ్యర్థుల ఛాతీ చుట్టు కొలత 77 సెం.మీ.లు ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ.లు వ్యాకోచించాలి. 

అప్లికేషన్లు ప్రారంభం: జులై 11. 
లాస్ట్ డేట్ : జులై 31.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులందరూ రూ.550తోపాటు జీఎస్టీ చెల్లించాలి.

ఆన్లైన్ ఎగ్జామ్ డేట్: 2025, సెప్టెంబర్ 25 నుంచి 

సెలెక్షన్ ప్రాసెస్ : ఆన్లైన్ రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ .. ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

శాలరీ: ఉద్యోగానికి ఎంపికైన వారికి మొదటి సంవత్సరం ప్రతి నెల రూ.30,000, రెండో సంవత్స రం ప్రతి నెల రూ.33,000, మూడో సంవత్సరం ప్రతి నెల 36,000, నాలుగో సంవత్సరం ప్రతి నెల రూ.40,000 చెల్లిస్తారు. నాలుగు సంవత్సరాల తర్వాత సర్వీస్ నుంచి బయటకు వచ్చే వారికి సేవానిధి ప్యాకేజీ కింద మొత్తం రూ. 10.04 లక్షలు చెల్లిస్తారు.

ఫేజ్-1 ఆన్లైన్ టెస్ట్: ఆన్లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్ చాయిస్ విధానంలో ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థుల విద్యార్హత ఆధారంగా పరీక్ష ఉంటుంది. ఎగ్జామ్ లో 10+2 సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షా సమయం 60 నిమిషాలు. 

-సైన్స్ ప్రమేయం లేని ఇంగ్లిష్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షా సమయం 45 నిమిషాలు.
- సైన్స్ తోపాటు సైన్స్ కాకుండా ఉన్న సబ్జెక్టుల నుంచి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షా సమయం 85 నిమిషాలు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున కోత విధిస్తారు. అభ్యర్థులు ప్రతి పేపర్లోనూ తప్పకుండా క్వాలిఫై కావాల్సి ఉంటుంది.

మరిన్ని పూర్తి వివరాలకు agnipathvayu.cdac.in వెబ్ సైట్లో సంప్రదించగలరు.