అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ పాలనాయంత్రాంగంలో మరో భారత అమెరికన్ సంతతికి చెందిన మహిళ నీరా టాండన్‌కు కీలక పదవి లభించింది. ఆమెను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సీనియర్ సలహాదారుగా నియమిసున్తన్నట్లు యంత్రాంగం ప్రకటించింది. గతంలో నీరాను వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్ (OMB) గా నియమించాలని బైడెన్ అనుకున్నప్పటికీ..విపక్షాలతో పాటు సొంత పార్టీ నేతల నుండి పలు విమర్శలు రావడంతో ఆమె నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.ఇప్పుడు నీరాను బైడెన్ సీనియర్ సలహాదారుగా నియమిస్తున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. నీరా తెలివితేటలు, చిత్తశుద్ధి, రాజకీయ అవగాహన బైడెన్ పరిపాలనకు కలిసి వస్తుందని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ వ్యవస్థాపకుడు జాన్ పొడెస్టా అన్నారు. నీరా గతంలో మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామాకు, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు సలహాదారుగా వ్యవహరించారు.
