వైట్‌హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా మరో భారతీయ అమెరికన్ వేదాంత పటేల్‌ను బైడెన్ నియమించారు. పటేల్ ప్రస్తుతం బైడెన్‌కు సీనియర్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. నవేడా, వెస్టెర్న్ ప్రైమరీ స్టేట్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. గతంలో భారతీయ అమెరికన్ కాంగ్రెస్ మహిళ ప్రమీలా జయపాల్ దగ్గర పటేల్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. కాంగ్రెస్ సభ్యులు మెన్ మైక్ హోండాకు కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్, ప్రెస్ సిబ్బంది 16 నియామకాల్లో పటేల్ ఒకరు.
