డ్రోన్లతో వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తోన్న ఆర్మీ

డ్రోన్లతో వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తోన్న ఆర్మీ

జమ్మూ కశ్మీర్‌లో మంచుతో కూడిన ప్రాంతాల్లోని సైనిక దళాలకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్‌ను సరఫరా చేయడానికి భారత సైన్యం డ్రోన్‌లను ఉపయోగిస్తోంది. ఈ డెలివరీ ప్రక్రియకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఈ వీడియోలో డ్రోన్లతో వ్యాక్సిన్లు ఉన్న ప్యాకేజీని ఎలా పంపిస్తున్నారనే దృశ్యాలు ఉన్నాయి. ‘మిషన్ సంజీవని’లో భాగంగా మారుమూల ప్రాంతాలకు వైద్య సామాగ్రిని, వ్యాక్సిన్లను అందించడానికి ఆర్మీ డ్రోన్లను వినియోగిస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో మంచు ఎక్కువగా ఉంటుండంతో వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా సరఫరా చేసేందుకు సిద్ధమైంది ఆర్మీ. 

ఆ వీడియోలో వ్యాక్సిన్లను ఓ పెట్టెలో పెట్టి ప్యాక్ చేసి.. దానిని డ్రోన్‌కు పెడుతున్నారు. తర్వాత ఆ డ్రోన్‌ను స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మొదటగా ఆర్మీ అధికారులు నిర్దేశిత గమ్యస్థానానికి ప్రయాణించే డ్రోన్‌కు వ్యాక్సిన్‌లతో ఉన్న ప్యాకేజీని జత చేస్తారు. తర్వాత ఆ డ్రోన్‌ను స్టార్ట్ చేస్తున్నారు. డ్రోన్  స్పాట్‌ కు చేరగానే వ్యాక్సిన్ ప్యాకెట్లను నేలపై జారవేస్తారు.  అలా కిందకు పడినప్పుడు వ్యాక్సిన్లకు ఎటువంటి నష్టం జరగకుండా గట్టి ప్యాకింగ్ చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం:

నా సమస్యకు పరిష్కారం ఢిల్లీలోనే దొరుకుద్ది

మేడారం జాతర ఫొటో గ్యాలరీ