నా సమస్యకు పరిష్కారం ఢిల్లీలోనే దొరుకుద్ది

నా సమస్యకు పరిష్కారం ఢిల్లీలోనే దొరుకుద్ది

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు శనివారం కీలక ప్రకటన చేశారు. అనంతరం సీనియర్ల సూచనలతో కొన్ని రోజులపాటు తన రాజీనామా విషయాన్ని వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే అంశంపై ఈరోజు ఆయన అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అయితే ఆయన అసెంబ్లీకి కారులో కాకుండా.. ఆటోలో వచ్చి అందరిలో ఆసక్తి రేపారు. తన కారు అందుబాటులో లేకపోవడంతో ఆటోలో వచ్చానని ఆయన అన్నారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంలో కూడా.. ఇలాగే కారు అందుబాటులో లేకపోతే  ఆటోలో వచ్చి ఆశ్చర్యానికి గురిచేశారు. 

కాగా.. ప్రెస్ మీట్‎లో మాట్లాడుతూ.. ‘ఇక్కడి నాయకులతో నా సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం లేదు. పెద్దల సూచన మేరకు 15 రోజుల పాటు వేచి చూస్తాను. ఈ సమయంలో నాకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల అపాయింట్‎మెంట్ ఇప్పిస్తే.. వారితోనే మాట్లాడుతాను. అపాయింట్‎మెంట్ దొరకకపోతే.. 15 రోజుల తర్వాత నా కార్యచరణ తెలియజేస్తాను.  నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇమడలేకపోతున్నాను. ఇకపోతే.. బీజేపీతో తనకు సంబంధముందన్న ముద్రను తొలగించుకోవడానికే కేసీఆర్.. బీజేపీయేతర సీఎంలను కలుస్తున్నాడు. కాంగ్రెస్‎ను చీల్చాలని కేసీఆర్ చూస్తే.. అది సాధ్యం కాదు.  దమ్మున్న వాళ్లు రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టినా సక్సెస్ అయితది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ’ అని జగ్గారెడ్డి అన్నారు.

For More News..

సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్‌‌‌‌ టు యూట్యూబర్‌‌

మేడారం జాతర ఫొటో గ్యాలరీ