భారత సైన్యంలో అగ్నివీర్‌‌‌‌ కు అప్లై చేసుకోండి : సికింద్రాబాద్ కర్నల్ సునీల్ యాదవ్

 భారత సైన్యంలో అగ్నివీర్‌‌‌‌ కు అప్లై చేసుకోండి : సికింద్రాబాద్ కర్నల్ సునీల్ యాదవ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: భారత సైన్యంలో అగ్నివీర్ నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రిక్రూట్‌‌మెంట్​డైరెక్టర్, సికింద్రాబాద్ కర్నల్ సునీల్ యాదవ్ తెలిపారు. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సున్న అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. 

2027 నియామక సంవత్సరానికి జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్‌‌మన్ విభాగాల్లో ఎంపికలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. 10 లేదా12వ తరగతి పాసైన వారు అధికారిక వెబ్‌‌సైట్ www.joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 1, 2026  అని వెల్లడించారు. పరీక్ష రుసుము రూ. 250గా నిర్ణయించామని వివరించారు.