జవాన్ల కోసం వెచ్చని నేస్తాలు వచ్చేశాయ్

జవాన్ల కోసం వెచ్చని నేస్తాలు వచ్చేశాయ్

లడఖ్: వింటర్ సీజన్ వచ్చేసింది. మెల్లిగా చలి పెరుగుతోంది. సీజన్ ఆఖరులో చలి మరింత ఎక్కువయ్యే కొద్దీ ఉదయం, సాయంత్రం పూట బయట తిరగడం కష్టమవుతుంది. మనకే అలా ఉంటే ఇంక మైనస్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో సరిహద్దుల వద్ద పహారా కాసే సైనికుల పరిస్థితి ఏంటి? ఎముకలు కొరికే చలిలో బార్డర్స్‌‌లో డ్యూటీ చేయడం.. పొంచి ఉన్న శత్రువులతో అప్రమత్తంగా ఉంటూ పహారా కాయడం బిగ్ చాలెంజ్ అనే చెప్పాలి. అందుకే ఈస్టర్న్ లడఖ్‌‌లో డ్యూటీ చేస్తున్న సైనికుల కోసం భారత ఆర్మీ ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ వెదర్ క్లోతింగ్‌‌ను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది.

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈస్టర్న్ లడఖ్‌‌లో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా తెప్పించిన కోల్డ్ వెదర్ క్లోతింగ్ అక్కడి చలి వాతావరణాన్ని తట్టుకుంటూ డ్యూటీ చేసేందుకు జవాన్లకు ఉపయోగపడుతుంది. లడఖ్‌‌ రీజియన్‌‌లోని సియాచిన్‌‌తోపాటు ఈస్టర్న్ లడఖ్‌‌లో పహారా కాస్తున్న జవాన్ల కోసం 60 వేల వింటర్ క్లోతింగ్ సెట్స్‌‌ను భారత ఆర్మీ అందుబాటులో ఉంచనుంది. మరో 30 వేల సెట్స్ త్వరలో దిగుమతి కానున్నాయి. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, డిఫెన్స్ సెక్రటరీ మార్క్ టీ ఎస్పర్ భారత పర్యటన ముగిసిన కొన్ని రోజుల్లోనే ఈ సెట్స్ డెలివరీ కావడం గమనార్హం.