ఆస్ట్రేలియాలో మనోడిపై దాడి.. కారులోంచి గుంజి కిందపడేసి కొట్టిన దుండగులు

ఆస్ట్రేలియాలో మనోడిపై దాడి.. కారులోంచి గుంజి కిందపడేసి కొట్టిన దుండగులు

మెల్బోర్న్‌‌‌‌: ఆస్ట్రేలియాలో మన దేశానికి చెందిన వ్యక్తిపై దుండగులు దాడికి దిగారు. కారులోంచి గుంజి, కిందపడేసి దారుణంగా కొట్టారు. కాళ్లతో తన్నారు. బూతులు తిట్టుకుంటూ వెళ్లిపోయారు. తీవ్రగాయాలైన బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 19న ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్‌‌‌‌లో జరిగిన ఈ దారుణం బుధవారం (జులై 23) వెలుగులోకి వచ్చింది. 

జులై 19న తన భార్యతో కలిసి చరణ్‌‌‌‌ప్రీత్‌‌‌‌ సింగ్‌‌‌‌ ఆడిలైడ్‌‌‌‌లోని కింటోర్‌‌‌‌‌‌‌‌ అవెన్యూలో జరుగుతున్న లైట్‌‌‌‌ ఎగ్జిబిషన్‌‌‌‌ను చూసేందుకు వెళ్లాడు. అక్కడ కారు పార్క్‌‌‌‌ చేస్తుండగా దుండగులు దాడికి దిగారు. ఏ కారణంలేకుండా ఐదుగురు వచ్చి చరణ్‌‌‌‌ప్రీత్‌‌‌‌ సింగ్‌‌‌‌ను చితకబాదారు. ఆపై కారులో వెళ్లిపోయారు. వాళ్లు వస్తూనే జాతిపరంగా దూషిస్తూ బూతులు తిట్టారని చరణ్‌‌‌‌ భార్య పేర్కొన్నారు. 

సమాచారం అందడంతో పోలీసులు స్పాట్‌‌‌‌కు చేరుకుని బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులలో ఒకరిని అరెస్ట్ చేశారు. మిగతావాళ్లకోసం గాలిస్తున్నారు.