బుమ్రా సిక్స్ వికెట్స్..ఇంగ్లాండ్ 110 ఆలౌట్

బుమ్రా సిక్స్ వికెట్స్..ఇంగ్లాండ్ 110 ఆలౌట్

టీ20 సిరీస్ గెలిచి జోరు మీదున్న  టీమిండియా తొలి వన్డేలోనూ దుమ్ము రేపింది. భారత బౌలర్లు బుల్లెట్ బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ భరతం పట్టారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆతిధ్య జట్టు..కేవలం 6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన రెండో ఓవర్లలోనే జేసన్ రాయ్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రూట్.. బుమ్రా  స్వింగ్కు పెవీలియన్ చేరాడు. ఈ ఇద్దరు డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత 3వ ఓవర్లో షమీ బెన్ స్టోక్స్ను బోల్తా కొట్టించాడు.  దీంతో  ఇంగ్లాండ్ 7పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇదే జోరును కొనసాగించిన భారత బౌలర్లు..17 పరుగుల వద్ద బెయిర్ స్టో ఔట్ చేశారు. 26 పరుగుల వద్ద ఆల్రౌండర్ లివింగ్ స్టన్ను  బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో మొయిన్ అలీ,బట్లర్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే 56 పరుగుల వద్ద ప్రసిద్ధ కృష్ణ మొయిన్ అలీని ఔట్ చేశాడు. ఆ తర్వాత  బట్లర్ను షమీ పెవీలియన్ చేర్చాడు. అక్కడి నుంచి ఇంగ్లాండ్ కోలుకోలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో డేవిడ్ విల్లే కాసేపు పోరాడిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరకు ఇంగ్లాండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా 6 వికెట్లు దక్కించుకోగా..షమీ మూడు వికెట్లు తీసుకున్నాడు. ప్రసిద్ధ కృష్ణ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక 19 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన బుమ్రా..ఇంగ్లాండ్ పై తక్కువ పరుగులిచ్చిన 6 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు నెహ్రా పేరిట ఉండేది. అతను వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్  పై 23 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు.