చెన్నై: ఎఫ్‌ఐహెచ్ మెన్స్ జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో ఇండియా కఠిన పరీక్షకు రెడీ అయ్యింది. శుక్రవారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో బలమైన బెల్జియంతో తలపడనుంది. లీగ్ దశలో చిలీ, ఒమన్, స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌ల్లో ఆతిథ్య కుర్రాళ్లు మొత్తం 29 గోల్స్‌తో అత్యుత్తమ స్ట్రయిక్ రేట్‌ను నమోదు చేశారు.
ఇప్పుడు బలమైన బెల్జియంపైనా అదే జోరు చూపెట్టాలని భావిస్తోంది. అయితే, ఇప్పటి వరకు పెద్దగా ఇబ్బంది ఎదుర్కోలేకపోయిన బ్యాకప్ లైన్‌కు ఈ మ్యాచ్‌లో కఠిన పరీక్ష తప్పదు. గోల్ కీపర్ ప్రిన్స్‌దీప్ సింగ్, బిక్రమ్‌జిత్ సింగ్, శిలానంద్ లక్రా, కెప్టెన్ రోహిత్, అన్మోల్ కీలకం కానున్నారు. దిల్‌రాజ్, మన్మిత్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, అజిత్ యాదవ్, గుర్జోత్ సింగ్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం.
