చెస్‌‌‌‌ టోర్నీలో వైశాలి పదో గేమ్‌‌‌‌ డ్రా

  చెస్‌‌‌‌ టోర్నీలో  వైశాలి పదో గేమ్‌‌‌‌ డ్రా

పాఫోస్‌‌‌‌ (సైప్రస్‌‌‌‌): దివిమెన్స్‌‌‌‌ క్యాండిడేట్స్‌‌‌‌ చెస్‌‌‌‌ టోర్నీలో ఇండియా గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ ఆర్‌‌‌‌. వైశాలి తన ఫామ్‌‌‌‌ను కొనసాగిస్తోంది. గురువారం అన్నా ముజిచుక్‌‌‌‌తో జరిగిన పదో రౌండ్‌‌‌‌ గేమ్‌‌‌‌ను వైశాలి 42 ఎత్తుల వద్ద డ్రా చేసుకుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఇండియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ మిడిల్‌‌‌‌ గేమ్‌‌‌‌లోనూ ఆకట్టుకుంది. దాంతో ముజిచుక్‌‌‌‌ చివరి వరకు ప్రయత్నించి డ్రాకు అంగీకరించింది. ఆరు పాయింట్లతో కొనసాగుతున్న వైశాలి టైటిల్‌‌‌‌ రేసులో మరో అడుగు ముందుకేసింది. ఇక అలెగ్జాండ్రా గొరియాచికినాతో జరిగిన గేమ్‌‌‌‌లో దివ్య దేశ్‌‌‌‌ముఖ్‌‌‌‌ (4.5) 63 ఎత్తుల వద్ద ఓటమిపాలైంది. ఓపెన్‌‌‌‌ సెక్షన్‌‌‌‌లో గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ ఆర్. ప్రజ్ఞానంద మళ్లీ ఓడాడు. సిందరోవ్‌‌‌‌ జావోకిర్‌‌‌‌తో జరిగిన గేమ్‌‌‌‌లో ప్రజ్ఞా 53 ఎత్తుల వద్ద పరాజయం చవిచూశాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 4.5 పాయింట్లే ఉండటంతో ఫైనల్‌‌‌‌కు చేరే అవకాశాలు మరింత సన్నగిల్లాయి.