గ్రాండ్గా ఇండియన్ క్రిస్టియన్ డే

గ్రాండ్గా  ఇండియన్ క్రిస్టియన్ డే

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ క్రిస్టియన్ ప్రెస్ క్లబ్ లో గురువారం  ఇండియన్ క్రిస్టియన్ డేను ఘనంగా జరుపుకున్నారు. సెయింట్ థామస్  చేసిన సువార్త పరిచర్యను కొనసాగించాలని క్రైస్తవ  సంఘాలు తీర్మానించాయి. క్రైస్తవం బ్రిటిష్​ వారిది కాదని, ఇండియాకు అంగ్లేయులు రావడానికి 1500 సంవత్సరాల ముందే క్రైస్తవం వచ్చిందని తెలంగాణ క్రైస్తవ సేన వ్యవస్థాపకుడు నాగళ్ల ఇస్రాయేల్  తెలిపారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఆనంద్, జెరుసాలేం మత్తయ్య, ఆండ్రూస్ జేవియర్, మోజెసెస్, రోమ్ చౌదరి, మెర్సీ, హరిత, అర్చన పాల్గొన్నారు.