
Assistant Commandant recruitment 2025: నిరుద్యోగులు, ఉద్యోగం కోసం చేస్తున్నవారికి మంచి అవకాశం. ఇండియన్ కోస్ట్ గార్డ్ 170 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దింతో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindiancoastguard.cdac.in ద్వారా ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే :
జనరల్ డ్యూటీ (GD) పోస్టులకి వయోపరిమితి: 21-25 సంవత్సరాలు (కోస్ట్ గార్డ్‌లో పనిచేస్తున్న సిబ్బందికి లేదా ఆర్మీ/నేవీ/వైమానిక దళంలో సమానమైన సిబ్బందికి 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది)
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగతి వరకు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ పొంది ఉండాలి.
టెక్నికల్ (మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) పోస్టులకి వయోపరిమితి: 21-25 సంవత్సరాలు (కోస్ట్ గార్డ్‌లో పనిచేసే సిబ్బందికి 5 సంవత్సరాల సడలింపు ఇచ్చారు)
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగాలలో ఇంజనీరింగ్ డిగ్రీ పాసై ఉండాలి.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలై 8 నుండి జూలై 23 వరకు ఓపెన్ చేసి ఉంటుంది.
ఎంపిక విధానం : ఎంపిక ప్రక్రియ ఐదు దశల్లో ఉంటుంది. స్టేజ్-Iలో రాత పరీక్ష, స్టేజ్-IIలో కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ & డిస్కషన్ టెస్ట్‌తో ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్ (PSB), స్టేజ్-IIIలో ఫిజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్‌లు ఇంకా ఇంటర్వ్యూతో ఫైనల్ సెలక్షన్ బోర్డ్ (FSB), స్టేజ్-IVలో ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికి వైద్య పరీక్ష ఉంటుంది. స్టేజ్-V అనేది ఎంపికైన అభ్యర్థులు అసిస్టెంట్ కమాండెంట్లుగా చేరే చివరి దశ.
దరఖాస్తు ఫీజు ఎంతంటే : ప్రతి ఒక్క అభ్యర్థులకు రూ. 300 ( SC/ST అభ్యర్థులకి మినహాయింపు కల్పించారు)
ప్రతినెల జీతం : అసిస్టెంట్ కమాండెంట్: రూ. 56,100
డిప్యూటీ కమాండెంట్: రూ. 67,700
కమాండెంట్ (జెజి): రూ. 78,800
కమాండెంట్: రూ. 1,23,100
ఎలా దరఖాస్తు చేసుకోవాలి :
స్టెప్ 1. మొదట అధికారిక వెబ్‌సైట్‌ను joinindiancoastguard.cdac.in ఓపెన్ చేయాలి.
స్టెప్ 2. ఇప్పుడు మీరు మీ పర్సనల్ ఇమెయిల్, మొబైల్ నంబర్ ఉపయోగించి రిజిస్టర్ చేసుకోవాలి.
స్టెప్ 3. తరువాత అవసరమైన డాకుమెంట్స్ అప్‌లోడ్ చేయండి:
* పాస్‌పోర్ట్ ఫోటో
* సంతకం
* 10వ/12వ/డిగ్రీ సర్టిఫికెట్లు
* ఒకవేళ వర్తిస్తే క్యాటగిరి/సర్వీస్/రెసిడెంట్ సర్టిఫికెట్స్ కూడా
స్టెప్ 4. దరఖాస్తు ఫీజు చెల్లించండి (మినహాయింపు లేకపోతే)
స్టెప్ 5. ఫామ్ సబ్మిట్ చేసి భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోండి.
పూర్తి వివరాల కోసం మీరు అధికారిక నోటిఫికేషన్‌ను చూడవచ్చు లేదా వెబ్‌సైట్ చూడవచ్చు.