కుక్కను ఆస్ట్రేలియా తీసుకెళ్లేందుకు రూ.15 లక్షలు ఖర్చు చేశారా..? ఈ హైదరాబాద్ కపుల్ సమాధానం వింటే షాకవుతారు !

కుక్కను ఆస్ట్రేలియా తీసుకెళ్లేందుకు రూ.15 లక్షలు ఖర్చు చేశారా..? ఈ హైదరాబాద్ కపుల్ సమాధానం వింటే  షాకవుతారు !

కుక్కను ఆస్ట్రేలియా తీసుకెళ్లేందుకు 15 లక్షల రూపాయలు ఖర్చు చేసింది ఓ హైదరాబాద్ ఫ్యామిలీ. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుక్కను కోసం ఇంత ఖర్చు చేయడమేంటి బ్రో.. అక్కడ కొత్త కుక్కను కొనొచ్చుగా..? అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అన్ని డబ్బులు పెడితే ఒక్క కుక్కేంటి..? వందల కుక్కలు కొనొచ్చు.. అంటూ ట్రోల్ చేస్తున్నారు. కానీ ఆ కపుల్ చెప్పిన సమాధానం విని అంత ఖర్చు చేయడంలో తప్పులేదులే అంటున్నారు. ఎందుకు కుక్క కోసం అంత ఖర్చుచేశారో చూద్దాం.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. కహానీ ఆఫ్ టేల్స్.. అనే టైటిల్ తో ఇన్ స్టాలో ఈ కాంప్లెక్స్ జర్నీ గురించి వివరించారు హైదరాబాద్ కపుల్. మేము ఆస్ట్రేలియాకు షిష్ట్ అవ్వాలనుకున్నపుడు చాలా ఎక్జైట్మెంట్ గా ఫీలయ్యాం. కానీ ఇండియా నుంచి తమ స్కై అనే పెంపుడు కుక్క ను నేరుగా తీసుకెళ్లే అవకాశం లేదని తెలిసి డిజప్పాయింట్ అయ్యాం. కానీ ఆరు నెలల తర్వాత మళ్లీ మా కుక్కన మేము తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.

వాస్తవానికి ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు కుక్కలను డైరెక్టుగా తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. కనీసం 6 నెలలు రేబీస్ ఫ్రీ కంట్రీ (రేబీస్ లేని దేశం)లో ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ఆస్ట్రేలియాకు అనుమతిస్తారు. దీనికి కనీసం 14 నుంచి 16 లక్షల రూపాయల ఖర్చవుతుంది.

అయితే చాలా మంది అంత ఖర్చు చేయడమెందుకు..? డబ్బు చాలా ముఖ్యం.. అంత డబ్బుతో అక్కడ కొన్ని అవసరాలు తీరిపోతాయని చెప్పారట. కానీ వీళ్లు చెప్పిన మాటలు ఆలోచింపజేస్తున్నాయి. డబ్బును మళ్లీ సంపాదించవచ్చు. కానీ కుక్కతో అనుబంధాన్ని కొనలేము. మళ్లీ సంపాదించలేము అని చెప్పారు. ఆరు నెలలు కుక్కను దుబాయి లో ఉంచి.. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు తీసుకెళ్లినట్లు చెప్పారు. 

ఆరె నెలల ఎదురు చూపులు..

ఆస్ట్రేలియా వెళ్లే ముందు ఆరు నెలలు దుబాయిలో గడపాల్సి వచ్చింది. రోజులు లెక్కపెడుతూ అక్కడ ఉన్నామని తెలిపింది ఆ జంట. ఆరు నెలలు అంటే ఎన్నో రోజులు ఉన్నట్లు అనిపించింది. ఎన్నో ఫోన్లు, వీడియో కాల్స్.. నెలల తరబడి వేదనను భరించి.. చివరికి ఆస్ట్రేలియాకు వెళ్లామని చెప్పారు. స్కై కేవలం కుక్క కాదు. అది మా బిడ్డ లాంటింది. దాని కోసం ఇలాంటి ఖర్చు, శ్రమ ఎన్నిసార్లైనా చేస్తాం అంటూ పోస్ట్ చేశారు. 

నెటిజన్స్ రెస్పాన్స్:

ఈ స్టోరీ తెలియని వాల్లు మొదట్లో చెత్త కామెంట్స్ చేసినా.. ఆ తర్వాత తమను మెచ్చుకున్నట్లు కపుల్ చెప్పారు. ఈ కపుల్ మెచ్చుకుంటూ చాలా కామెంట్స్ చేస్తున్నారు. పెంపుడు జంతువులు అంటే కుటుంబ సభ్యులు.. వస్తువులు కాదు. వాటిపై మీకున్న ఆపేక్షకు సలాం అంటూ కామెంట్స్ చేశారు. జంతువును ఇంతలా ప్రేమిస్తున్నారంటే మీరు చాలా గొప్ప పేరెంట్స్ అంటు మరొకరు కామెంట్ చేశారు. ఆరు నెలలు వేచి ఉండి కుక్కను తీసుకెళ్లడం చాలా గొప్ప విషయం అంటూ రిప్లై ఇస్తున్నారు. ఇది చూసి నేను ఏడ్చేశా.. మీలాంటి వాళ్లు ఉండటం స్కై చాలా లక్కీ అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఖర్చు ఎక్కువైనప్పటికీ.. వర్త్ ఫుల్ అంటూ రిప్లై ఇస్తున్నారు.