టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు మంగళవారంతో ముగియనుండటంతో ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడ ఉన్న భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. వచ్చే 48 గంటలు భారతీయులందరూ ఎక్కడి వారు అక్కడే ఉండాలని తెలిపింది. అనవసరంగా బయటకు రాకూడదని సూచించింది. విద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలకు దూరంగా ఉండాలని చెప్పింది. బహుళ అంతస్తుల భవనాల్లో పై అంతస్తుల్లో ఉండకూడదని స్పష్టం చేసింది. ఎంబసీ ఏర్పాటు చేసిన హోటళ్లలో ఉంటున్న వారు అధికారులతో నిరంతరం టచ్‌లో ఉండాలని కోరింది.
