మన ఫిల్టర్ కాఫీకి ప్రపంచం ఫిదా.. ఆ టేస్టే వేరు

మన ఫిల్టర్ కాఫీకి ప్రపంచం ఫిదా.. ఆ టేస్టే వేరు

టీ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నప్పటికీ ఫిల్టర్ కాఫీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కాఫీలలో సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీకి ఉన్న టేస్ట్ వేరు.ఫిల్టర్ కాఫీని ఇష్టపడే వారు ఉదయం పూట ఒక కప్పు కాఫీ తాగనిదే తమ రోజు స్టార్ట్ అవ్వదని అంటూ ఉంటారు. అలాంటి ఫిల్టర్ కాఫీ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ది బెస్ట్ అని తేలింది. ఇటీవల టేస్ట్ అట్లాస్ అనే ఓ సంస్థ ప్రపంచవ్యాప్తంగా దొరికే కాఫీ మీద జరిపిన అధ్యయనంలో సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచంలోకెల్లా బెస్ట్ కాఫీగా క్యూబాకు చెందిన " క్యూబన్ ఎస్ప్రెస్సో " మొదటి స్థానంలో నిలిచింది. ఈ సంస్థ అధ్యయనంలో ఇచ్చిన ర్యంకింగ్స్ ఇలా ఉన్నాయి.

1 క్యూబన్ ఎస్ప్రెస్సో ( క్యూబా )

2 ఇండియన్ ఫిల్టర్ కాఫీ ( ఇండియా )

3 ఎస్ప్రెస్సో ఫ్రెడ్దో ( గ్రీక్ )

4 ఫ్రెడ్డో క్యాపచినో ( గ్రీక్ )

5 కేఫ్ బొంబొన్ ( స్పెయిన్ )

6 క్యాపచినో ( ఇటలీ )

7 టర్కిష్ కాఫీ ( టర్కీ )

8 రిస్ట్రేటో ( ఇటలీ )

9 ఫ్రాప్పే ( గ్రీక్ )

10 వియత్నామీస్ ఐస్డ్ కాఫీ ( వియత్నాం )

క్యూబన్ ఎస్ప్రెస్సో, సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీలను తయారు చేసే విధానమే వాటికి యూనిక్ టేస్ట్ రావటానికి కారణమని టేస్ట్ అట్లాస్ సంస్థ అభిప్రాయపడింది. మొత్తానికి మన ఫిల్టర్ కాఫీకి ఇండియన్స్ మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం ఫిదా అయ్యిందన్నమాట.