భారత సంతతి జర్నలిస్టుపై అమెరికాలో  దాడి

భారత సంతతి జర్నలిస్టుపై అమెరికాలో  దాడి

వాషింగ్టన్: అమెరికాలో ఇండియన్ జర్నలిస్టుపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేశారు. శనివారం వాషింగ్టన్​లోని ఇండియన్ ఎంబసీ ఎదుట ఖలిస్తాన్ సపోర్టర్లు నిరసన తెలపగా, దాన్ని కవర్ చేసేందుకు జర్నలిస్టు లలిత్ ఝా వెళ్లారు. అయితే అక్కడున్న కొంతమంది ఆయనను తిడుతూ అటాక్ చేశారు. తనపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను లలిత్​ ఆదివారం ట్వీట్ చేశారు.

‘‘ఈ వీడియోలోని వ్యక్తి రెండు కర్రలతో నాపై దాడి చేశాడు. నా ఎడమ చెవిపై కొట్టాడు. నేను పోలీసులకు ఫోన్ చేశాను. ఈ క్రమంలో మరింత బెదిరించాడు. ఇంతలో పోలీసులు వచ్చి నన్ను కాపాడారు” అని లలిత్ ఝా పేర్కొన్నారు. తనను కాపాడినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అయితే తనపై దాడి చేసినోళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకోవడం లేదని చెప్పారు. ‘‘ఖలిస్తాన్ సపోర్టర్లు అమృత్ పాల్ కు మద్దతుగా ఖలిస్తాన్ జెండాలతో ఎంబసీ ఎదుట నిరసన తెలిపారు. ఎంబసీని ధ్వంసం చేస్తామని ఇండియన్ అంబాసిడర్ తరణ్ జిత్ సింగ్ సంధూను బెదిరించారు” అని వెల్లడించారు. కాగా, లలిత్ ఝాపై దాడిని ఇండియన్ ఎంబసీ తీవ్రంగా ఖండించింది.