కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో ఫైనల్లోకి ఇండియా మెన్స్‌‌, విమెన్స్‌‌ టేబుల్‌‌ టెన్నిస్‌‌ జట్లు

కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో ఫైనల్లోకి ఇండియా మెన్స్‌‌, విమెన్స్‌‌ టేబుల్‌‌ టెన్నిస్‌‌ జట్లు

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో ఇండియా మెన్స్‌‌, విమెన్స్‌‌ టేబుల్‌‌ టెన్నిస్‌‌ జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. బుధవారం జరిగిన మెన్స్‌‌ సెమీస్‌‌లో ఇండియా 3–0తో ఇంగ్లండ్‌‌పై గెలిచింది. తొలి మ్యాచ్‌‌లో మనుష్‌‌ షా 11–9, 11–9, 11–6తో కానర్‌‌ గ్రీన్‌‌పై, రెండో మ్యాచ్‌‌లో మానవ్‌‌ ఠక్కర్‌‌ 11–8, 11–4, 11–5తో జోసెఫ్‌‌ హంటర్‌‌పై, మూడో మ్యాచ్‌‌లో హర్మీత్‌‌ దేశాయ్‌‌ 11–5, 11–5, 11–5తో బెంజామిన్‌‌ పిగోట్‌‌పై గెలిచారు. విమెన్స్‌‌లో ఇండియా 3–1తో ఇంగ్లండ్‌‌ను ఓడించింది.

తొలి మ్యాచ్‌‌లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ 11–6, 11–3, 11–9తో చియుక్‌‌ లామ్‌‌ జాస్మిన్‌‌ వాంగ్‌‌పై గెలిచి శుభారంభాన్నిచ్చింది. రెండో మ్యాచ్‌‌లో టిన్‌‌ టిన్‌‌ హో 11–9, 11–6, 11–7తో యశస్విని గోర్పడేను ఓడించడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌‌లో సిండ్రెల్లా డాస్‌‌ 11–7, 11–4, 11–9తో అన్నా గ్రీన్‌‌పై గెలవగా, నాలుగో మ్యాచ్‌‌లో శ్రీజ 11–8, 5–11, 11–6, 8–11, 11–9తో టిన్‌‌ టిన్‌‌ హోపై సంచలన విజయం సాధించింది. ఫైనల్లో ఇండియా జట్లు.. మలేసియాతో తలపడతాయి.