ఏవియేషన్ పరికరాల స్మగ్లింగ్.. భారతీయుడికి 30 నెలల జైలు

ఏవియేషన్ పరికరాల స్మగ్లింగ్.. భారతీయుడికి 30 నెలల జైలు
  • అమెరికా కోర్టు తీర్పు 

న్యూయార్క్: ఒరెగాన్ నుంచి రష్యాకు విమాన విడి భాగాలను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన భారతీయుడికి అమెరికా కోర్టు 30 నెలల జైలు శిక్ష విధించింది. నిందితుడు వ్యక్తిగత లాభం కోసం యూఎస్ నేషనల్ సెక్యూరిటీ, ఫారిన్ పాలసీలకు సంబంధించిన సేఫ్ గార్డ్స్ ను దెబ్బతీయడానికి ప్రయత్నించాడని ఒరెగాన్ డిస్ట్రిక్ కోర్టు ఈ వారం ప్రారంభంలో తీర్పును వెలువరించింది. ఢిల్లీకి చెందిన సంజయ్ కౌశిక్ కు ఈ శిక్షను విధించింది. ఈ మేరకు శుక్రవారం జస్టిస్ డిపార్ట్ మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. సంజయ్ కౌశిక్ యూఎస్ కు చెందిన ఏరో స్పేస్ గూడ్స్, టెక్నాలజీని రష్యాకు చట్టవిరుద్ధంగా అందించేందుకు ఇతరులతో కలిసి కుట్ర పన్నాడు.

సెపెంబర్ 2023 నుంచి దీనికి పథకం వేశాడు. ఆ గూడ్స్ ను ఆయన  భారతీయ కంపెనీ కోసం ఉద్దేశించినవి అనే నెపంతో కొనుగోలు చేశాడు. అయితే, వాస్తవానికి అవి రష్యన్ సంస్థలకు అందించేందుకు కొన్నాడు. కౌశిక్, ఇతర కుట్రదారులు ఒరెగాన్ కు చెందిన సప్లైయర్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ కు నావిగేషన్ అండ్ ప్లైట్ కంట్రోల్ డేటాను అందించే పరికరమైన యాటిట్యూడ్ అండ్ హెడింగ్ రిఫరెన్స్ సిస్టమ్ (ఏహెచ్ఆర్ఎస్) కొనుగోలు చేశారు.