
విశాఖ : చైనాలో జరుగుతున్న అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షలో భారత నేవీ టీమ్ తన సత్తాను ప్రదర్శిస్తోంది. భారత నౌకాదళం తరఫున కోల్‌కతా, శక్తి నౌకలు వెళ్లాయని.. తూర్పు నౌకాదళం తెలిపింది. ఈ నౌకలు అక్కడికి చేరిన సందర్భంగా… గౌరవ సూచకంగా చైనా దళం 21 తుపాకులతో గాలిలోకి కాల్పులు జరిపిందని వివరించింది.
చైనాలోని పోర్టు సిటీ కింగ్‌దావోలో 4 రోజులు ఈ కార్యక్రమం జరగనుంది. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు బలపడడానికి ఇది దోహదపడుతుందని అభిప్రాయపడింది.