చెట్టు బెరడులో కలిసిపోయినట్లు ఉన్న ఈ పక్షి పేరు ఇండియన్ నైట్ జార్. ఎండిన ఆకులు, చెట్ల బెరడు, నేల రంగులో కలిసిపోతూ శత్రువుకు కనిపించకుండా తనను తాను కాపాడుకుంటుంది. ఉదయం, సాయంత్రం మాత్రమే చురుగ్గా ఉండే ఈ పక్షులు పగటి పూట కదలకుండా నేలపై నక్కి ఉంటాయి.
ఈ జాతి పక్షులు దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్, జన్నారం అటవీ డివిజన్‌లో కనిపించిన ఈ పక్షిని ఎఫ్‌డీవో ఎం.రాంమోహన్ తన కెమెరాల బంధించారు.
జన్నారం రూరల్, వెలుగు
