రేపు ఐర్లాండ్ ప్రధానిగా లియో వరాద్కర్‌ ప్రమాణం

రేపు ఐర్లాండ్ ప్రధానిగా లియో వరాద్కర్‌ ప్రమాణం

భార‌త సంత‌తికి చెందినవాళ్లు కేవలం అక్కడ స్థిర‌ప‌డ‌డ‌మే కాకుండా అక్కడి రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఐర్లాండ్ ప్రధానిగా లియో వరాద్కర్‌ ఎన్నికయ్యారు. రేపు (శనివారం డిసెంబర్ 17న ) ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. 43 ఏళ్ల  లియో వరాద్కర్‌  ప్రధానిగా ఎన్నికవ్వడం ఇది రెండోసారి. అంతకుముందు ఆయన 2017 నుంచి 20 వరకు ఐర్లాండ్ కు ప్రధానిగా పనిచేశారు. 

లియో తండ్రి అశోక్ వ‌రాద్కర్‌ .. మ‌హారాష్ట్రలోని వ‌రాద్ గ్రామానికి చెందిన ఆయ‌న ఒక డాక్టర్. 1906 లో  బ్రిటన్ కు వలస వచ్చారు. ఐర్లాండ్ కు చెందిన మరియంను వివాహం చేసుకున్నారు. లియో 2019లో తన స్వగ్రామమైన వ‌రాద్ కు వచ్చారు. తాను ఒక గే అని  లియో వరాద్కర్‌ బ‌హిరంగంగా ప్రక‌టించారు. కరోనా టైమ్ లో దేశాన్ని స‌మ‌ర్థంగా న‌డిపించినందుకు గానూ అక్కడి ప్రజలు ఆయనకు మరోసారి మ‌ద్దతు తెలిపారు. లియో వరాద్కర్‌ భార్య పేరు మాథ్యూ బారెట్..  ఈమె కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్నారు.