రెండోసారి ఐర్లాండ్ పీఎంగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతి వ్యక్తి

రెండోసారి ఐర్లాండ్ పీఎంగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతి వ్యక్తి

భారత సంతతి వ్యక్తి లియో వరాద్కర్ ఐర్లాండ్ ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. రొటేషన్ పద్ధతిలో ఎన్నికైన ఫిన్ గేల్ పార్టీకి చెందిన వరాద్కర్.. ఐర్లాండ్‌ ప్రధానిగా అవకాశం రావటం జీవతకాల పురస్కారమని అన్నారు. రెండోసారి అవకాశం వచ్చిన సందర్భంగా డబ్లిన్‌లోని ఐర్లాండ్‌ పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో మాట్లాడిన లియో వరాద్కర్‌... గత వందేళ్లలో సాధించిన అభివృద్ధి ఆధారంగా రానున్న తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాలన సాగిస్తానని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ దేశం అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రచించి పక్కాగా అమలుపరుస్తానన్నారు. కరోనా వ్యాప్తి సమయంలో సహకారం అందించిన మైఖేల్‌ మార్టిన్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. 

2017లో తొలిసారి ప్రధాని పదవీ బాధ్యతలను స్వీకరించిన వరాద్కర్.. ఐర్లాండ్‌ చరిత్రలో అతి పిన్న వయసులో ప్రధాని అయిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అంతే కాకుండా తాను స్వలింగ సంపర్కుడినని లియో 2015లో బహిరంగంగా ప్రకటించారు. 1906 లో వరాద్కర్ బ్రిటన్ కు వలస రాగా.. ఐర్లాండ్ కు చెందిన మరియంను వివాహం చేసుకున్నారు. లియో 2019లో తన స్వగ్రామమైన వ‌రాద్ కు వచ్చారు. కాగా అతని భార్య పేరు మాథ్యూ బారెట్.. ఈమె కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్నారు.