
ఇండియన్ అమెరికన్ భవ్యా లాల్ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తాత్కాలిక చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితులయ్యారు.అధ్యక్షుడు జోబైడెన్ ఆధ్వర్యంలో నాసాలో సమూల మార్పుల కోసం ఏర్పాటైన సమీక్షా టీంలో భవ్యా లాల్ సభ్యురాలిగా ఉన్నారు. ఇంజనీరింగ్, స్పేస్ టెక్నాలజీలో ఎంతో అనుభవం ఉన్న భవ్య 2005 నుంచి 2020 వరకూ శాస్త్ర సాంకేతిక రంగాల విధాన సంస్థ (STPI) లో సభ్యురాలిగా సేవలందించారు.
భవ్యా లాల్ అనేక ఫెడరల్ సైన్స్ కమిటీల్లో చురుకుగా పనిచేశారని నాసా తెలిపింది. STPI లో చేరకముందు ఆమె సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ రీసెర్చి, కన్సల్టింగ్ సంస్థ సీఎస్‌టీపీఎస్ ఎల్‌ఎల్‌సీ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారని తెలిపింది. అంతరిక్ష రంగంలో ఆమె అందించిన విశేష సేవలకు గాను భవ్యా లాల్ ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ కరస్పాండింగ్ మెంబర్‌గా ఎంపికయ్యారు.