- దుబాయ్‌లో గుండెపోటుతో భారత సంతతి కమెడియన్ మృతి
భారత సంతతికి చెందిన స్టాండప్ కమెడియన్ మంజునాథ్ నాయుడు(36) గుండెపోటుతో చనిపోయారు. దుబాయ్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జోక్స్ చెబుతూ, ఆడియన్స్‌ను నవ్విస్తూనే ఆయన కుప్పకూలిపోయారు. ఒత్తిడి గురించి చెబుతుండగా ఆయన స్టేజిపై పడిపోవడంతో అది కూడా షోలో భాగమేమోనని అంతా భావించారు. ఎంతసేపటికీ మంజునాథ్ లేవకపోవడంతో నిర్వాహకులు స్టేజిపైకి వెళ్లి చూడగా.. ఆయనలో చలనంలేదు. దీంతో మంజునాథ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనను పరీక్షించి, అప్పటికే చనిపోయాడని తేల్చారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వల్లే మంజునాథ్‌కు గుండెపోటు వచ్చి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గురించి చెప్తూ.. ఎలా ఎక్సైట్ అయ్యేవాడో వివరిస్తున్న టైంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని మంజునాత్కో ఆర్టిస్ట్చెప్పారు. అబుదాబిలో పుట్టిన మంజునాథ్ దుబాయ్‌లో స్థిరపడ్డారు. తల్లిదండ్రులు గతంలోనే చనిపోగా.. మంజునాథ్ సోదరుడితో ఉంటున్నారు.
