అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ హత్య

అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ హత్య

వాషింగ్టన్: అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇండియాకు చెందిన డాక్టోరల్(పీహెచ్ డీ) స్టూడెంట్ ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. హత్యకు గురైన స్టూడెంటును ఆదిత్య అదాల్ఖా(26)గా అధికారులు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్ స్కూల్‌‌లో ఆదిత్య మాలిక్యులర్ అండ్ డెవలప్‌‌మెంటల్ బయాలజీ ప్రోగ్రామ్‌‌లో  ఫోర్త్  ఇయర్ చదువుతున్నట్లు చెప్పారు. ఈ నెల 9న తన కారులో వెళ్తున్న అదిత్యపై కొందరు కాల్పులు జరిపారని వెల్లడించారు.

స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. ట్రీట్మెంట్ పొందుతూ రెండు రోజుల తర్వాత చనిపోయాడని తెలిపారు. బాధితుడి కారుకు మూడు బుల్లెట్ రంధ్రాలు ఉన్నాయన్నారు. దర్యాప్తు కొనసాగుతున్నదని వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటిదాకా ఎవరినీ అరెస్టు చేయలేదని స్థానిక మీడియా కూడా పేర్కొంది. ఆదిత్య తన మెడికల్ కోర్స్ కోసం ఇండియా నుంచి సిన్సినాటికి వెళ్లారు. అతను 2018లో  యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన రాంజాస్ కాలేజ్ నుంచి జువాలజీలో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు.ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి 2020లో ఫిజియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పొందాడు.