నేపాల్‌లోని గురువారం ( ఆగస్టు 24) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిది. ఈ ప్రమాదంలో ఆరుగురు భారతీయ యాత్రికులు సహా ఏడుగురు మృతి చెందారు. మరో 19 మంది యాత్రికులు గాయపడ్డారని నేపాల్ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం బారా జిల్లాలోని చురియమై సమీపంలో జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు
ప్రావిన్స్‌లోని బారా జిల్లాలో గురువారం ( ఆగస్టు 24) తెల్లవారుజామున రాజస్థాన్ నుండి యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు సిమారా సబ్-మెట్రోపాలిటన్ సిటీ వద్ద చురియమై ఆలయానికి దక్షిణంగా నదీతీరం వద్ద రోడ్డుపై 50 మీటర్ల దూరంలో పడిపోయినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని ఖాట్మండు పోస్ట్ వార్తాపత్రిక తెలిపింది.ఈ ప్రమాదంలో ఆరుగురు భారతీయులతో పాటు ఒక నేపాల్ పౌరుడు కూడా మృతి చెందగా, మరో 19 మంది గాయపడ్డారు.
ఆరుగురు భారతీయ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు నది ఒడ్డున అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. అందులో మొత్తం 26 మంది ప్రయాణికులు ఉన్నారు బస్సు డ్రైవర్ జిలామీ ఖాన్‌తో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని బారా జిల్లా పోలీసు కార్యాలయ చీఫ్‌గా ఉన్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోబీంద్ర బోగటి తెలిపారు. గాయపడిన వారందరూ పక్కనే ఉన్న మక్వాన్‌పూర్ జిల్లా హెతౌడాలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
దేశవ్యాప్తంగా రహదారి సౌకర్యాలు బాగుండకపోవడంతో నేపాల్‌లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. బుధవారం, నేపాల్‌లోని బాగ్మతి ప్రావిన్స్‌లో ప్రయాణీకుల బస్సు ప్రధాన రహదారిపై నుండి జారిపడి నదిలోకి పడిపోవడంతో ఎనిమిది మంది మరణించగా 15 మంది గాయపడ్డారు.ఖాట్మండు నుండి పోఖారాకు వెడుతున్న బస్సు ధాడింగ్ జిల్లాలోని చాలిసే వద్ద త్రిశూలి నదిలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
