బైడెన్ సర్కారులో అంజలికి కీలక పదవి

బైడెన్ సర్కారులో అంజలికి కీలక పదవి

వాషింగ్టన్: ప్రముఖ లీగల్ ఎక్స్ పర్ట్, ఇండియన్ అమెరికన్ అంజలి చతుర్వేదిని మాజీ సైనికుల సంక్షేమ విభాగం జనరల్​ కౌన్సిల్​కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ నామినేట్ చేశారు. ఈ విభాగం పరిపాలనలో ఆమెకు కీలకమైన పదవిని అప్పగించనున్నట్లు తెలిపారు. న్యాయ సేవల్లో ఎంతో అనుభవం కలిగిన అంజలి ఈ విభాగం ప్రమాణాలను మరింతగా పెంచుతారని వైట్​హౌస్ పేర్కొంది. అమె అమెరికా న్యాయశాఖ నేర విభాగం డిప్యూటి అసిస్టెంట్ అటార్నీ జనరల్​గా కొనసాగారు. న్యూయార్క్​లోని కార్ట్​లాండ్​లో జన్మించిన అంజలి న్యాయవాదిగా, న్యాయ శాఖలో పలు విభాగాల్లో సేవలు అందించారు.